మేం రాగానే...టీడీపీ వాళ్లను నరికేస్తాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.  రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని..  వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు.

New Update

మాజీమంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.  రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని..  వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఈ కామెంట్స్ చేశారు.  టీడీపీ నేతలు తమపై కక్ష పెట్టుకోవద్దంటున్నారు.. అది మాత్రం జరగదు..  ఎవర్నీ వదలమని తెలిపారు.  గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడుతామని...  గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతామన్నారు.  మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్లింటికి మనిల్లు అంతే దూరమేనని తెలిపారు.  గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి మరి నరికిపారేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో  కారుమూరి వ్యాఖ్యలపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.

New Update
anvesh sensational comments on bigg boss contestants

anvesh sensational comments on bigg boss contestants

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.  

ఉగ్రదాడికి వీరే కారణం

అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. 

అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment