Breaking : ఏపీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ దుర్మరణం.!
ఏపీలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఆదేశాలతో వృద్ధురాలు కృష్ణవేణికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. 60 ఏళ్లుగా ఫ్యామిలీ పెన్షన్ కోసం పోరాడుతున్న ఆమెకు ఊరట లభించింది. లోకాయుక్త ఆదేశాలతో వృద్ధురాలికి రూ.15.70 లక్షలు చెల్లించారు ట్రెజరీ అధికారులు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 76 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకూ అప్లై చేసుకోవాలి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో బీసీ గురుకుల హస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఆరుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి తరలించగా.. మిగిలిన వారికి హాస్టల్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అందుకుంది. యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద 3,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఐ.సి.డి.ఎస్. కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు. అధికారంలోకి వచ్చాక తమ గోడు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాదెండ్ల మనోహర్ అరెస్టుపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. రాజమండ్రిలో విమానాశ్రయం ఏర్పాటుపై బీజేపీ, వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఎంపీ భారత్ కేంద్రాన్ని కోరారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సర్పంచ్ చేసిన పని తోకాడ, మల్లంపూర్ గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మట్టి తవ్వకాలకోసం చెరువుకు గండి కొట్టించడంతో ఇళ్లలోకి నీరు చేరడంతోపాటు చేతికొచ్చిన ధాన్యం, పంట పోలాలు నాశనం అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.