పురంధేశ్వరి నామినేషన్-LIVE
రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ వర్షాబాలకృష్ణ దారుణ హత్యకు గురైయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఈ రోజు రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడొచ్చు.
AP: పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అస్వస్థతకు గురయ్యారు. ఎఫ్.కె.పాలెంలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో అస్వస్థతకు లోనయ్యారు. ప్రచారం మధ్యలోనే ఆపేసి.. ఆఫీసుకు వెళ్లిపోయిన గీతకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గీతకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగినట్లు వైద్యులు తెలిపారు.
ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకమంటూ మండిపడ్డారు సినీ కమెడియన్ పృథ్వీరాజ్. ముద్రగడ ఒక పెద్ద దరిద్రం అంటూ దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు.
వైసీపీ దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్మోహన్ రెడ్డి మరో కోడి కత్తి డ్రామా చేద్దామని చూశారని అయితే, ఆ డ్రామా అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. అధికారం కూటమిదేనన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ 20 మంది పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్లను అందజేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులతో స్వయంగా ప్రమాణం చేయించారు. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. ప్రతీ అభ్యర్థిని గెలవాలని కోరారు.
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట లభించింది. గాజు గ్లాసును తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.. వేసిన రెండు పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈసీ జనసేనకే గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
సీఎం జగన్ దాడి విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ చేయించాలన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలన్నారు.