పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్ రోడ్ షో-LIVE
పి.గన్నవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వారి రోడ్ షో లైవ్ చూడండి.
పి.గన్నవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వారి రోడ్ షో లైవ్ చూడండి.
సినీ తారల ఎంట్రీతో పిఠాపురం పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరుఫున జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కచ్చితంగా పవన్ లక్షకుపైగా మెజార్టీతో గెలుస్తారన్నారు.
అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చినకోనెలకు చెందిన సార కొత్తయ్య చిన్న కుమారుడు ఈశ్వరరావు (3) అనారో గ్యంతో మృతి చెందాడు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కొడుకు మృతదేహంతో తండ్రి ఏకంగా 8 కిలోమీటర్లు నడిచాడు.
ఎన్నికలు అయ్యే వరకు జబర్దస్త్ చేయనని కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించడంమే తన లక్ష్యమన్నారు. నెలరోజుల పాటు షూటింగులు బంద్ చేసుకొని ప్రచారం చేస్తామన్నారు.
జనసేన అధినేత పవన కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడును నియమించారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాయుడుతో పాటు కొణిదెల నాగబాబు, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను, మొగలిరేకులు శ్రీ సాగర్, జానీ మాస్టర్ పేర్లను ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు లేదని టీడీపీ నేత వర్మ విమర్శలు గుప్పించారు. పిఠాపురంలో వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా పవన్ కళ్యాణ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ తరుఫున ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ గెలిపించి తీరతామని వర్మ పేర్కొన్నారు,రాష్ట్రం అంతా ప్రచారం చేయవలసిన బాధ్యత మాపై ఉంది.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాకపోయినా మా ప్రచారం ఆగదని వర్మ పేర్కొన్నారు
అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది భారత చైతన్య యువజన పార్టీ. 32 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఈ క్రమంలో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని పోటీలోకి దింపారు.