మండపేటలో పవన్ కల్యాన్ మీటింగ్_LIVE
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ మండపేటలో పర్యటిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ మండపేటలో పర్యటిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
జనసేనకు 2 నియోజకవర్గాల్లో ఆందోళన మొదలైంది. రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో పేరును పోలిన పేర్లు, గుర్తులు ఉన్నాయి. నిడదవోలులో కందుల దుర్గేష్‌కు పోటీగా కంచర్ల దుర్గేష్ బరిలోకి దిగారు. ఈయన గ్లాసు గుర్తును దగ్గరగా ఉండే బక్కెట్ గుర్తుతో పోటీ పడుతున్నారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. తన పేరును పద్మనాభం కాకుండా .. పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు.
అంబాజీపేటలో వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొని నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీను, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 42 ఏళ్లు పార్టీ కోసం పని చేసిన తనను.. తణుకు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఓడించేందుకు... మరోసారి జగన్‌ను సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన అన్న కుమారుడు, ప్రముఖ హీరో వరుణ్ తేజ్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్లాసు గుర్తుకు ఓటేసి మా బాబాయ్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఆయన ప్రచారం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.