Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించిన ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించారు.. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

New Update
FotoJet (6)

Do you know about the 'Sanjeevani' project started by Bill Gates?

ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించారు. : మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. బిల్ గేట్స్ బృందంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సంజీవని ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ జరిగింది. సంజీవని ప్రాజెక్టును.. ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజీవని ప్రాజెక్టుతో పాటుగా ఇతర అంశాలపైనా బిల్ గేట్స్ బృందం.. ఏపీ ప్రభుత్వంతో చర్చించినట్లు సమాచారం.. ఇదే సమయంలో టెక్నాలజీ ఆధారిత డయాగ్నస్టిక్ సేవలు, మెడ్ టెక్ కార్యక్రమాలపైనా చర్చించినట్లు తెలిసింది.

 ‘సంజీవని ప్రాజెక్టు ప్రత్యేకతలు 

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిసి 'సంజీవని' (Sanjeevani) ప్రాజెక్టును ప్రారంభించారు.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు. ఇందులో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ,టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భాగస్వాములుగా వ్యవహరిస్తుండటం విశేషం.

ఈ ‘సంజీవని’ ప్రాజెక్టు  ప్రధాన ఉద్దేశ్యం ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డ్ అందించడం.  ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణగా ఏపీ ప్రభుత్వం సంజీవని పథకాన్ని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మాతా శిశుసంరక్షణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ఉంటుంది. జారీ చేసిన ఈ డిజిటల్ హెల్త్ కార్డులలో పౌరులకు సంబంధించిన వైద్యపరీక్షలు, చికిత్సల వివరాలతో పాటుగా, డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, వ్యాక్సినేషన్ వివరాలు నమోదవుతాయి. అలాగే రెండున్నర లక్షల వరకూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. సంజీవని తద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా వైద్యం చేయించుకున్నప్పుడు పాత రిపోర్టులు వెతకాల్సిన పని ఉండదు. వీటితో పాటు ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ సేవలు,  ప్రతీ కుటుంబానికి రూ. 2.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా నడుస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Advertisment
తాజా కథనాలు