డిప్యూటీ సీఎం పవన్ తిరుమల పర్యటన ఖరారు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఖరారు అయ్యింది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలతో చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించడానికి అక్టోబర్ 2వ తేదీన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు.

New Update
TTD Pawan Kalyan

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాయశ్చిత దీక్షను అక్టోబర్ 3వ తేదీన తిరుమలలో విరమించనున్నారు. అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 4గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకి అలిపిరి చేరుకుని మెట్ల మార్గం ద్వారా తిరుమలకు పోనున్నారు. రాత్రి 9గంటలకి తిరుమలకు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు అనగా అక్టోబర్ 3వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత దీక్షను విరమిస్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో వచ్చిన విమర్శలపై మాట్లాడే అవకాశం ఉంది. 

ఇది కూడ చూడండి:  ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దీపావళి నుంచే ఉచిత సిలిండర్

Advertisment
Advertisment
తాజా కథనాలు