/rtv/media/media_files/2024/12/20/WKJmIhAQSSxlJkhV7LE0.jpeg)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు.
/rtv/media/media_files/2024/12/20/o4ZHq6c2rExYdkfm3DbX.jpeg)
ఆయనకు గిరిజన ప్రజలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వాతావరణం అనుకూలించక పోయినా.. చిరుజల్లులు తడిపేస్తున్నా లెక్కచేయలేదు.
/rtv/media/media_files/2024/12/20/AGQ4vGCz20571ZddEYzF.jpeg)
డోలీ మోతల కాలం చెల్లాలనే లక్ష్యంతో పవన్ మన్యంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామంలోని పరిస్థితులు చూసి చలించిపోయారు.
/rtv/media/media_files/2024/12/20/XYaFsnb87aqsVDuPUcjy.jpeg)
ఈ మేరకు మక్కువ మండలంలోని గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదు అనే లక్ష్యంతో రహదారుల నిర్మాణానికి పునాది వేశారు.
/rtv/media/media_files/2024/12/20/j8BqTXcqaKH6F968uCOB.jpeg)
దాదాపు 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా రూ.36.71 కోట్ల వ్యయంతో.. 39.32 కి.మీ మేర రహదారుల నిర్మాణానికి పునాది వేశారు.
/rtv/media/media_files/2024/12/20/f85FU8YLy2AcnxEFquHt.jpeg)
ఈ రోడ్ల నిర్మాణంతో 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి కల్పించనున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆత్మీయంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
/rtv/media/media_files/2024/12/20/tXEc5fpq27PFNJpZk2rF.jpeg)
రెండు నెలలకొక సారి మన్యంలో తిరుగుతానని.. గిరిజన బిడ్డలకు, యువతకు, పెద్దలకు ఒకటే మాట చెబుతున్నా.. ఒళ్లు వంచి పని చేస్తానని పవన్ పేర్కొన్నారు.
/rtv/media/media_files/2024/12/20/0JAAUsdHwJUtpkDnQBQD.jpeg)
ఇదిలా ఉంటే పవన్ కాలినడకన చెప్పులు లేకుండా బాగుజోల గ్రామానికి వెళ్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.