Atreyapuram : తీవ్ర విషాదం.. బొబ్బర్లంక వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని బొబ్బర్లంక గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

New Update
FotoJet (8)

Three missing in Godavari near Bobbarlanka.

Atreyapuram : అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని బొబ్బర్లంక గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలోని పిచ్చుకలంక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల స్వస్థలం రాజమహేంద్రవరంలోని జాంపేటగా గుర్తించారు. జాంపేటకు చెందిన షేక్ బిలాల్(27), షేక్ సుల్తాన్ (20), మహ్మద్ అర్పద్ (18) అనే ముగ్గురు యువకులు పని నిమిత్తం బొబ్బర్లంకకు వెళ్లారు. ఈ క్రమంలో పని ముగించుకున్న వారు సమీపంలోని గోదావరిలో స్నానం చేయడానికి నదిలోకి దిగారు.  అయతే అక్కడ నది లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ముగ్గురు నదిలో గల్లంతయ్యారు.  గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ముగ్గరు నదిలో కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్లను ఘటనా స్థలానికి పిలిపించి గాలింపు చర్యలు చేపట్టగా కాసేపటికి షేక్ బిలాల్ మృతదేహం లభించింది.

మిగిలిన ఇద్దరు షేక్ సుల్తాన్, మహ్మద్ అర్పద్ కోసం పోలీసులు, ఈగగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, వీరిలో షేక్ సుల్తాన్ బీటెక్ చదువుతుండగా.. మహ్మద్ అర్పద్ ఇంటర్ చదువుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా తమ వారు నదిలో కొట్టుకుపోయారని తెలుసుకున్న బాధిత కుటుంబాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారి రోదనలు స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి. ఆత్రేయపురం ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు