GOOD NEWS: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్.. అదనంగా రూ.4000!

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 190 కొత్త 108 అంబులెన్సు వాహనాలు కొనుగోలు చేయాలన్నారు. ఇక నుంచి 108, 104 వాహనాల సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉంచాలని నిర్ణయించారు. అలాగే 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4వేలు ఇవ్వాలని పేర్కొన్నారు.

New Update
CM Chandrababu Naidu approves 190 new ambulance vehicles in AP

CM Chandrababu Naidu approves 190 new ambulance vehicles in AP

రోడ్డు ప్రమాదాలు, ఇతర విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడేవి అంబులెన్సులు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, రోగుల ప్రాణాలను కాపాడటంలో అంబులెన్సు సిబ్బంది ఎప్పుడూ ముందుంటారు. ప్రమాద సమయంలో 108 నెంబర్‌కు కాల్ చేసిన నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ప్రాణాలను రక్షిస్తుంటారు.

Also Read: స్ట్రీట్‌ ఎక్స్‌ స్టోర్‌లో ఫ్రీ ఆఫర్..ఎగబడ్డ జనం తొక్కిసలాట

అయితే ఇంకొన్ని ప్రాంతాల్లో అంబులెన్సు జాడే కనిపించదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అంబులెన్సుల కొరత ఉంది. అందువల్ల సకాలంలో ఆయా ప్రాంతాల ప్రజలకు వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం

ప్రతి మూలకు అంబులెన్సు

రాష్ట్రంలోని ప్రతి మూలకు అంబులెన్సు సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రానికి మరిన్ని కొత్త అంబులెన్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అందులో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో అంబులెన్సు కొరతను పూడ్చేందుకు రెడీ అయ్యారు. 

Also Read: రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన విగ్రహాలు

190 కొత్త అంబులెన్సులు

దాదాపు 190 కొత్త 108 వాహనాలు కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అంతేకాకుండా ఇక నుంచి 108 వాహనాలు, 104 వాహనాల సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉంచాలని నిర్ణయించారు. ఇదొక్కటి మాత్రమే కాకుండా 108 అంబులెన్సు డ్రైవర్లు, సిబ్బందికి తీపి కబురు అందించారు. 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4000 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Also Read: అన్నా వర్సిటీ బాధితురాలికి భారీ పరిహారం.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

అలాగే రాష్ట్రంలో కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు