అమరావతిలో ఐదెకరాలు కొన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో ఇంటి స్థలం కొన్నారు. అమరావతిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్లాట్ కొనుగొలు చేశారు. ఈ ప్లేస్ లో ఆయన సొంతిల్లు నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అతిథి గృహంలో ఉంటున్నారు. By K Mohan 04 Dec 2024 | నవీకరించబడింది పై 04 Dec 2024 07:15 IST in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో 5 ఎకరాల స్థలం కొన్నారు. అమరావతి పరిధిలో బాబు వ్యక్తిగత వినియోగానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి జడ్జిల బంగ్లాలు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, ఎన్జీవోల రెసిడెన్సీల సమీపంలో ఉంది. సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఈ స్థలాన్ని కొన్నట్లు సమాచారం. ఇక్కడ ప్రస్తుతం సాయిల్ టెస్టులు చేస్తున్నారు. ఐదెకరాల భూమిలో కొంత భాగంలో ఆయన ఇల్లు నిర్మించుకొని.. మిగిలిన స్థలం పార్కింగ్, సెక్కూరిటీ, గార్డె్న్ ఇంట్లో పనివారి షెల్టర్లకు ఉంచనున్నారు. ఇది కూడా చదవండి : Lokesh: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక నుంచి మధ్యాహ్నా భోజనం గతంలో అమరావతి రాజధానిగా పనులు దగ్గర పడితే అక్కడే సొంతిల్లు కట్టుకుంటా అని చంద్రబాబు పలు మార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెలగపూడి రెవెన్యూ పరిధిలోని 25వేల చదరపు గజాల ప్లాట్ కొన్నారు. దీనికి నాలుగు వైపుల రోడ్డు మార్గం ఉంది. అమరావతిలోని పరిపాలనా కార్యాలయాలకు ఇక్కడి నుంచి సులభంగా చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి : మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో వైన్‌షాప్‌లు బంద్! ముగ్గురు రైతుల దగ్గరు నుంచి ఈ స్థలం కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే రైతులకు డబ్బులు కూడా చెల్లించినట్లు సమాచారం. ఇన్ని రోజులనుంచి ఆయన ఉండవల్లి బ్రిడ్జ్ రోడ్ లోని లింగమనేని అతిథి గృహంలో ఉంటున్నారు. అమరావతి రాజధానిగా నిర్మాణమైయ్యాకే సొంత ఇల్లు కట్టుకుంటానని చాలాసార్లు చెప్పారు చంద్రబాబు. హైదరాబద్ లో కూడా ఈయనకు సొంత ఇల్లు ఉంది. #amaravathi #land #ap-poltics #cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి