YCP: చంద్రబాబు రాళ్ల దాడి కేసులో వైసీపీ నేతలు.. వారితో భారీ డీల్! చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిలో వైసీపీ నేతల హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. 3 టీమ్ లు కుట్రకు పాల్పడ్డాయని ఏసీపీ తిలక్ తెలిపారు. By srinivas 25 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2022లో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిలో వైసీపీ నేతల హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. చంద్రబాబు పర్యటనకు ముందు అప్పటి ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి దాడికి కుట్ర చేశారని తెలిపారు. ఈ దాడిలో చంద్రబాబుకు తగలాల్సిన రాయి ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావు తగలిందని ఏసీపీ తిలక్ వెల్లడించారు. చంద్రబాబుపై పథకం ప్రకారమే దాడికి కుట్ర చేశారని తిలక్ చెప్పారు. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. 295కే ఆసిస్ ఆలౌట్ Also Read : అదానీకి రేవంత్ బిగ్ షాక్.. సంచలన నిర్ణయం! విచారణలో ఒప్పుకున్న నిందితులు.. నిందితులు మూడు టీమ్ లు గా ఏర్పడి కుట్ర చేశారు. పథకం ప్రకారమే కరెంట్ తీసి పక్కా స్కెచ్ వేశారు. చంద్రబాబుపై రాళ్ల దాడిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే అప్పటి పోలీసులు కేసు సరిగ్గా దర్యాప్తు చేయలేదు. చంద్రబాబుపై దాడి లక్ష్యంగా ఎమ్మెల్సీ అరుణ్ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు హస్తం ఉన్నట్లు విచారణ లో నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు 17 మంది ఈ దాడిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్టు చేసిన కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు రూ.20 వేల పూచీకత్తులో సెల్ఫ్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇక ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని ఏసీసీ తిలక్ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: KTR: తప్పు జరిగింది.. పొరపాటైంది: లగచర్ల మహాధర్నాలో కేటీఆర్ Also Read : ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్లోకి ముగ్గురు మాజీ మంత్రులు! #ycp #ntr-district #tdp-leaders #cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి