APSRTC ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. రూ.10 లక్ష బెనిఫిట్!

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా చేయనున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించనున్నారు.

New Update
APSRTC

APSRTC

APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించాలని అవికూడా ఆయా కాంట్రాక్టర్లు చెల్లిస్తారని తెలిపింది. ఏఎస్‌ఎస్‌వై కింద బీమా అమలు చేయనున్నామని యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బీమా ఉద్యోగుల్లో ఎవరెవరికి వర్తిస్తుందో కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read :  నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

Also Read :  భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

ఏపీఎస్‌ ఆర్టీసీలోని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ప్రభుత్వం ఈ బీమా సౌకర్యాన్ని కల్పించ నుంది. వారందరికి రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో అద్దె బస్సుల డ్రైవర్లు, ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్లు, ట్రాఫిక్‌ గైడ్లు, కౌంటర్లలో బస్‌ టికెట్లు బుక్‌చేసే సిబ్బంది, ఏసీ బస్సుల్లోని అటెండర్లు, బస్టాండ్లు, గ్యారేజ్‌లు, ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేసే స్వీపర్లు, ఇతర ఉద్యోగులు అందరికీ బీమా వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

ఏఎస్‌ఎస్‌వై (పోస్టల్‌ శాఖ అంత్యోదయ శ్రామిక్‌ సురక్ష యోజన) కింద ఈ బీమా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీనికి గాను ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని కూడా ఆయా ఉద్యోగులను నియమించుకున్న కాంట్రాక్టర్లు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ఈ మేరకు ఈడీ (ఆపరేషన్స్‌) అప్పలరాజు.. అన్ని జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులు, జోనల్‌ ఈడీలకు ఆదేశాలు జారీచేశారు.  

ఇది కూడా చదవండి: Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!

మరోవైఆర్టీసీలో రిటైరైన ఉద్యోగులను తీసుకునే ప్రతిపాదన రద్దు చేయాలని ఎన్‌ఎంయూఏ (నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌) కోరింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో రిటైరైన ఉద్యోగులను కాంట్రాక్ట్, పొరుగు సేవల విధానంలో తీసుకోవాలనే ప్రతిపాదనను రద్దు చేయాలని వారు కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకీ లేఖ రాసినట్లు ఎన్ఎంయూఏ ప్రతినిధులు తెలిపారు. సంస్థలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించకుండా.. ఇలా రిటైరైన ఉద్యోగులను తీసుకోవడం సరైంది కాదన్నారు. సకాలంలో ప్రమోషన్లు రాకపోవడం వల్ల చాలామంది ఇంక్రిమెంట్లు లేకుండానే పదవి విరమణ చేస్తున్నారని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు.

Also Read: J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో..వాతావరణశాఖ

Also Read :  మహా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నానం

Advertisment
Advertisment
Advertisment