అధికారం కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న వైసీపీకి.. బీజేపీ బిగ్ షాక్ ఇవ్వనుందా? ఢిల్లీలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేయనుందా? ప్రస్తుతం జరగనున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం ఔను అనే అనిపిస్తోంది. రాజకీయాలకు దూరం అవుతున్నట్లు వైఎస్ ఫ్యామిలీతో మూడు తరల అనుబంధం కలిగిన విజయసాయిరెడ్డి ప్రకటించడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. ఏ పార్టీలోకి వెళ్లను.. ఇక వ్యవసాయం చేసుకుంటానని ఆయన పైకి ప్రకటిస్తున్నా.. బీజేపీ స్కెచ్ లో భాగంగానే ఈ ప్రకటన చేశారన్న ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో లోక్ సభ, రాజ్యసభలో వైసీపీ అడ్రస్ లేకుండా చేసేందుకు NDA కూటమి పక్కా ప్లాన్ చేస్తోందని.. ఇందులో భాగంగానే విజయసాయి ఈ ప్రకటన చేశారన్న టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Bandla Ganesh vs Vijayasai: పాపం జగన్ ను వదిలేస్తావా.. విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ సెటైర్లు!
అమిత్ షా పర్యటనతో మారిన రాజకీయ సమీకరణాలు..
ఇటీవల ఏపీలో అమిత్ షా పర్యటించిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ తోనే విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాలను వదులకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇందులో ముగ్గురు ఇప్పటికే రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్.కృష్ణయ్య ఉన్నారు. వీరి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో 7కి పడిపోయింది. అయితే విజయసాయిరెడ్డి బాటలోనే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సైతం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: పాలిటిక్స్ కు గుడ్ బై... 25న వైసీపీకి రాజీనామా.. కొడాలి నాని సంచలన ప్రకటన?
ప్రస్తుతం అయోధ్య రామిరెడ్డి విదేశాల్లో ఉన్నారు. వచ్చే వారం రాజ్యసభ సభ్యత్వానికి అయోధ్యరామిరెడ్డి రాజీనామా చేయనున్నారు. దీంతో వైసీపీ బలం 6కి పడిపోయింది. గొల్లబాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పరిమళ్ నత్వాని మాత్రమే వైసీపీకి రాజ్యసభలో మిగలనున్నారు. లోక్‌సభలో అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనుజరాణి, మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే.. ఎన్డీయే కూటమి ఆపరేషన్ ఆకర్ష్ తో వీరంతా కూడా వైసీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లేకపోతే వైసీపీ పార్లమెంటరీ పార్టీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదన్న చర్చ కూడా ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.