/rtv/media/media_files/2025/03/11/8fszPcyTEC7QIgC1LRyw.jpg)
Posani Krishna Murali.
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి కి ఉపశమనం లభించింది. తమ అధినేతలను కించపర్చారని ఆదోని పోలీస్ స్టేషన్ లో పోసానిపై పలువురు టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆదోని కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు, పోసాని తరపు వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !
కాగా నరసరావుపేటతో పాటు రాజంపేటలో నమోదు అయిన కేసుల్లోనూ ఆయనకు ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నమోదైన కేసుల్లో పోసానికి కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కర్నూలు జైలులో ఉన్నారు. విజయవాడ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం ఆయనకు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
Also Read: పాకిస్థాన్‌లో ట్రైన్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు.. నిర్బంధంలో వందలాది ప్రయాణికులు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 2024, నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని త్రీ టౌన్‌లో పోలీస్ స్టేషన్‌లో పోసానిపై జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై బీఎన్‌ఎస్ 353(1),353(2),353(సి)సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు.
Also Read: ప్రపంచంలో అత్యంత 20 కాలుష్య నగరాల్లో 13 మనవే!
మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిపై జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు.ఇటీవల పీటీ వారెంట్‌పై కోర్టులో పోసానిని హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నేడు పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేసింది. దీంతో పోసాని బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు లాయర్లు చెబుతున్నారు.
Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్ కీలక ఆదేశం