Pithapuram : పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ..  వర్మపైకి దూసుకెళ్లిన పెండెం దొరబాబు!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

New Update
varma

కాకినాడ జిల్లా పిఠాపురం(pithapuram) లో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ(tdp)-జనసేన(janasena) శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ మొదలైన వివాదం, చివరకు కూటమి పార్టీల మధ్యే మాటల యుద్ధానికి, తోపులాటలకు దారితీసింది.

కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu) ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ(SVSN Varma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎం ఫోటో ఉండాల్సిందేనని అధికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని విమర్శిస్తూ టీడీపీ శ్రేణులతో కలిసి నిరసనకు దిగారు.

Also Read :  మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

తుమ్మలబాబుతో వర్మకు వాగ్వాదం

ఈ క్రమంలో అక్కడే ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబుతో వర్మకు వాగ్వాదం జరిగింది. ఈ వివాదంలోకి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కలుగజేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ దొరబాబు నేరుగా వర్మపైకి దూసుకెళ్లారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. 

టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడంతో పడా కార్యాలయ ప్రాంగణం రణరంగంగా మారింది. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాటలు జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కూటమి పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు బయటపడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. భారీగా మోహరించిన కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  ఇందకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    

Also Read :  తల్లికి మించిన కూతురు.. అన్షు మాలికకు అమెరికా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక అవార్డ్‌!

Advertisment
తాజా కథనాలు