/rtv/media/media_files/2025/03/04/sB7THHGEt1UxkZ2fpnVF.jpg)
Old Woman Murdered
Old Woman Murdered : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణం జరగింది. కాసు బంగారం వృద్ధురాలి ప్రాణం తీసింది. కామేశ్వరి వీధిలో గున్నమ్మ అనే వృద్ధురాలిని... గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కామేశ్వరి వీధిలో గున్నమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. గున్నమ్మ ప్రతి రోజు తెల్లవారుజామున పూలు సేకరించి... సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు పంపిణీ చేస్తుంటుంది. ఇవాళ ఉదయం కూడా పూలు సేకరిస్తుండగా... 85 ఏళ్ల వృద్దురాలిని ముక్కు పుడక కోసం అతికితకాంగా హతమార్చాడు ఆగాంతకులు. వృద్దురాలిని దుండగులు 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి హత్య చేశారు. ముక్కు కోసి ఆభరణాలు దొంగిలించారు.
Also Read: ట్రంప్ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది: వారెన్ బఫెట్!
Also Read: హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!
ప్రతిరోజులాగే దేవుడి కోసం పూలు ఏరుతూ హంతకుడికి పట్టు బడ్డ గున్నమ్మ. ముక్కు పుడక తస్కరించే ప్రయత్నంలో ఆమెపై అఘాత్యానికి పాల్పడి హత్య చేసి ఉంటారని పోలీసులు ఆనుమానిస్తున్నారు. పూజ కోసం పువ్వులు ఏరుతూ వృద్దురాలు ప్రాణాలు పొగొట్టు్కోవడం స్థానికంగా సంచలనం రేపింది. వృద్ధురాలిని హత్య చేయడం పట్ల స్థానికులు విషాదం వ్యక్తం చేశారు. కేవలం కాసు బంగారం కోసం వృద్ధిరాలిని హత్య చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Also Read: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..
క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆగాంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.... సీసీ టీవీ ఫుటేజీల ద్వారా దుండగుల వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడి కోసం గాలిస్తున్నామని టెక్కలి డిఎస్సీ మూర్తి వివరించారు.
Also Read: Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన