ఏపీ రేషన్ మాఫియాపై సిట్ సరే.. అదానీ స్కాం పరిస్థితి ? : వైఎస్ షర్మిళ

రేషన్ బియ్యం అక్రమాలపై సిట్ విచారణ సంతోషంగా ఉందని APCC చీఫ్ షర్మిళ అన్నారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడని ఆమె ప్రశ్నించారు. అందులో పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేదని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

author-image
By K Mohan
New Update
YS Sharmila Emotional

రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషంగా ఉందని APCC చీఫ్ షర్మిళ అన్నారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడని ఆమె ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు.

అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? అని షర్మిళ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదానీకి అమ్ముడుపోయారా అని ఆమె అంది. తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా అని విమర్శించారు.

నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారని సీఎం చంద్రబాబును అడిగారు. TDP ప్రతిపక్షంలో ఉండగా.. SECIతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్ షర్మిళ. టెండర్లు లేకుండా అదానీకి కాంట్రాక్టులు కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లకదా అని ఆమె ఆరోపించారు. 

ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం

గుజరాత్ లో రూ.1.99లకు దొరికే సోలార్ విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2.49లకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశార కదా.. ఇప్పడు 25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని ఆమె చెప్పారు. ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని వివరించారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారు.

ఇప్పుడు వారే అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మరి ఇప్పుడేమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని, తక్షణమే అదానీతో చేసుకున్న సోలార్ పవర్ ఒప్పందాలు రద్దు చేయాలని షర్మిళ డిమాండ్ చేశారు.
ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chiranjeevi - Mark Shankar: పవన్ కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. చిరంజీవి సంచలన ట్వీట్

మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అతడు ఇంకా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు. మార్క్ శంకర్  కోలుకోవాలని మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశాడు.

New Update
పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా దట్టమైన నల్లటి పొగ ఎక్కువగా పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పవన్ ఫ్యాన్స్, మెగా అభిమానులు, జన సేన కార్యకర్తలు, జన సైనికులు పూజలు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

చిరంజీవి ట్వీట్

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ అందిచారు. మా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చేశాడని.. కానీ అతడు ఇంకా కోలుకోవాలి అని తెలిపాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేశాడు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో.. మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

రేపు హనుమత్ జయంతి.. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి.. ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో.. ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్  కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు  తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

(megastar chiranjeevi latest | Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar | latest-telugu-news | telugu-news)

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

Advertisment
Advertisment
Advertisment