ఏపీలో కొత్త లిక్కర్ పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం.. రూ.99కే క్వార్టర్! ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నేటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 9వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం లభించనుంది. By B Aravind 01 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Liquor Policy: కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి అక్టోబర్ 1నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉండబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తుదారులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక్కో టెండర్ రూ.2 లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సివుండగా.. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక డెబిట్, క్రెడిట్ కార్డు లేదా బ్యాంకు చలానా ద్వారా ఫిజు చెల్లించాలని సూచించింది. డీడీ ఎక్సైజ్ స్టేషన్లలో తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపింది. అక్టోబర్ 11న లాటరీ.. ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. అక్టోబర్ 12న లైసెన్సు దారులు కొత్త దుకాణాలు తెరుచుకోవచ్చు. లైసెన్సు ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షలుండగా.. 10 వేల లోపు జనాభాకు రూ.50 లక్షలు చెల్లించాలి. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.85 లక్షలు. ప్రతి సంవత్సరం ఆరు విడతల్లో లైసెన్సు ఫీజు చెల్లించాలి. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు కేటాయించారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం. వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. వీటి లైసెన్సు ఫీజు ఏడాదికి ఒక కోటి రూపాయలు. తగ్గిన ధరలు.. రూ.99కే క్వార్టర్ మద్యం అందించేలా ధరలు కేటాయించారు. వైసీపీ హయాంలో 10 రకాల పన్నులు విధించగా నూతన మద్యం విధానంలో 6కు కుదించారు. దీని ద్వారా ఏడాదికి రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ ఆదాయం సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. #ap-cm-chandrababu #andrapradesh #new-liquor-policy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి