/rtv/media/media_files/2025/04/03/7CCIMMnkQKCrAYAX9ryV.jpg)
nagababu mlc
సినీ నటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి ఆయనను అభినందించారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన.. తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు. మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకం. నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్ ఉపయోగించడం గౌరవంగా భావించా అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dear Annayya, I'm deeply grateful for your love and support. The pen you kindly gifted me, along with Vadina, was truly special, and I was honored to use it during my swearing-in ceremony https://t.co/D4UEt8ozzu pic.twitter.com/OUAVsoDLR9
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 2, 2025
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు చేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నాగబాబు తన సతిమణీతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నాగబాబును సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయనకు బహూకరించారు. అంతకుముందు చంద్రబాబును శాలువాతో సత్కరించిన నాగబాబు దంపతులు సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు. తనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. వారి సూచనలకు అనుగుణంగా తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని నాగబాబు వెల్లడించారు.
Also read : Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!
Also read : Ameenpur : కలిపిన గెట్ టు గెదర్.. చిగురించిన అక్రమ సంబంధం.. సంసారం నాశనం!