Nara Lokesh: క్షమించండి.. మళ్లీ అలా జరగనివ్వను.. నారా లోకేష్ సంచలన ట్వీట్!

విజయవాడ కనవిజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని.. తాను నీరు లేదని పలువురు భక్తులు ఎక్స్ లో చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. అసౌకర్యానికి గురైన భక్తులకు క్షమాపణలు చెప్పారు.

author-image
By Nikhil
New Update
Nara Lokesh Tweet

Nara Lokesh: విజయవాడ కనకదుర్గ ఆలయం(vijayawada durga temple) వద్ద పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని.. తాను నీరు లేదని పలువురు భక్తులు ఎక్స్ లో చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. అసౌకర్యానికి గురైన భక్తులకు క్షమాపణలు చెప్పారు. తమ టీం సంబంధిత డిపార్ట్మెంట్ ను ఈ విషయమై సంప్రదిస్తు్ందన్నారు. ఇలాంటి సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
ఇది కూడా చదవండి: AP Cabinet: తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ.. ఏపీ కేబినెట్ వరాల జల్లు!

ఇది కూడా చదవండి: Chandrababu: ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ..సీఎం చంద్రబాబు

నారా లోకేష్ యాక్షన్ ఏంటి?

ఈ రోజు ఉదయం విజయవాడ కనకదుర్గ టెంపుల్ కు వెళ్లిన ఓ భక్తుడు ఆలయంలోని పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ప్రసాదం కౌంటర్ దగ్గర తాగు నీటి సదుపాయం లేదన్నాడు. నిర్వహణ సరిగా లేదన్నాడు. అసలు ఈ ఆలయానికి ఈవో ఉన్నాడా? అంటూ ప్రశ్నించాడు. ఎన్డీయే ప్రభుత్వంలో ఇలాంటివి చూడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్టుకు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేశాడు. దీంతో నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి : CM Revanth: రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్-PHOTOS

 ఖతర్ లో చిక్కుకున్న మహిళకు భరోసా..

తూర్పుగోదావరి జిల్లా కొత్తూరుకు చెందిన జీవనకుమారి అనే మహిళ బ్రతుకుదెరువు కోసం ఖతర్ దేశం వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయింది. దీంతో ఆమెను కాపాడాలంటూ మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేసి ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు సైతం లోకేష్ స్పందించారు. ఆ మహిళలను ఇక్కడికి తీసుకురావడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : ఆయుష్మాన్ భారత్ ఒప్పందం.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం కోర్టు బ్రేక్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు