/rtv/media/media_files/2025/02/24/bzFgsGbdBEPEQZosFRkf.jpg)
Kinjarapu Atchannaidu YS Jagan
: ఏ రాజకీయ పార్టీ అయినా... అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసం పని చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడూ అసెంబ్లీకి రాని వైసీపీ అసెంబ్లీకి వస్తే సంతోషించానన్నారు. కానీ ఈరోజు పరిణామాలు చూస్తే కేవలం అటెండెన్స్ కోసమే వచ్చినట్లుందని ఫైర్ అయ్యారు. అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని భయపడి వచ్చారని ఫైర్ అయ్యారు. నోరు విప్పితే అబద్దాలు చెప్పడం, ప్రజలను మభ్యపెట్టడం వైసీపీ నేతలకు అలవాటైందన్నారు. ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చినా వైసీపీ నేతలు మారకపోవడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు స్వార్థంతోనే వ్యవహరించారన్నారు.
Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!
అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకెళ్లారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానని చెప్పిన వైసీపీ ఒక రాజకీయ పార్టీయేనా? అంటూ ప్రశ్నించారు. 11స్థానాల్లో గెలిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగానికి విరుద్ధంగా అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? అంటూ జగన్ ను ప్రశ్నించారు. ఏ హోదా అయినా ఇచ్చేదీ ప్రజలేనని గుర్తుంచుకో.. అంటూ జగన్ కు సూచించారు. వైసీపీ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఎన్నికలలో ఢిల్లీ సీఎంగా పనిచేసి ఓడిన కేజ్రీవాల్ అసెంబ్లీకి వెళ్తానంటే అర్దం ఉంటుందా? అని ప్రశ్నించారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని జగన్ అనలేదా? అని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. 4 రోజుల తర్వాత నాకు సీఎం పదవి ఇస్తానంటేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అంటారేమో.. అని సెటైర్లు వేశారు అచ్చెన్నాయుడు.
Also Read: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
మంత్రి సవిత కామెంట్స్
పులివెందుల ఎమ్మెల్యే ఇంకా భ్రమలోనే ఉన్నారనిపిస్తుందని మరో మంత్రి సవిత సెటైర్లు వేశారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారో జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. నిర్ణయాన్ని మార్చుకుని అసెంబ్లీకి రావాలని... మాట్లాడే సమయం ఇస్తామని జగన్ కు సవిత సూచించారు. అన్నీ తెలిసి జగన్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ కు లండన్ మెడిసిన్ సరిగా పనిచేసినట్లు లేదని సైటెర్లు వేశారు.