/rtv/media/media_files/2025/03/29/e6Rv7t145xXWKCtlQ0sE.jpg)
Ap Konaseema disappeared six students found
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో షాకింగ్ ఘటన జరిగిన విషయం తెలిసిందే. స్కూల్‌కు వెళ్లమని తల్లిదండ్రులు మందలించినందుకు ఖండ్రిగ పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పారిపోయారు. ఈ ఘటన 24వ తేదీన జరిగింది. తాజాగా ఆ ఆరుగురు విద్యార్థుల జాడను పోలీసులు కనిపెట్టారు. వారి తల్లి దండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కంప్లైంట్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే వారిజాడను తెలుసుకున్నారు.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
స్టూడెంట్స్ దొరికారు
ఆ 6గురు విద్యార్థులు మార్చి 24వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోగా.. తల్లిదండ్రులు వెతికి వెతికి.. చివరికి శుక్రవారం (28/03/2025) పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఎస్సై ఎం.అశోక్ తమ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో బాగంగానే సిఐ విద్యాసాగర్‌రావు బృందం ఆ ఆరుగురు విద్యార్థులను గుర్తించింది. వారిని ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా, సిద్దాంతంలో పట్టుకున్నారు. ప్రస్తుతం వారిని ఆలమూరు తీసుకుని వస్తున్నారు.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ఏం జరిగిందంటే?
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం ఖండ్రిగపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. వీరంతా సమీప బంధువులే కావటం గమనార్హం. విద్యార్థులు ఆరుగురు స్థానికంగా ఉన్న హైస్కూలులో చదువుతున్నారు. అయితే ఆరుగురు ఒకేసారి కనిపించకుండా పోయారు.
Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పాఠశాలకు సరిగా వెళ్ళడం లేదని తల్లితండ్రులు మందలించడంతోనే వీరంతా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన వారిలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మార్చి నెల 24 నుంచి ఈ ఆరుగురు విద్యార్థులు కనిపించడం లేదని తెలిసింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి
వీరందరూ బంధువులే కావటం.. అందరూ కూడా కొత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతుండటంతో కలిసే ఎక్కడికైనా వెళ్లారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో వీరి ఆరుగురి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేలు నగదు బహుమతి కూడా అందజేస్తామని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ ఆరుగురి జాడ తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.