గులియన్ బ్యారీ సిండ్రోమ్ కేసులు పట్ల వైద్యరోగ్య శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుల్లియన్ బేర్ సిండ్రోమ్ కేసులపై ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాధిపై స్పెషల్ ఛీప్ సెక్రటరీ కృష్ణబాబుతో కలసి సీఎం వద్ద సమీక్ష చేశామన్నారు. గత సంవత్సరం కూడా రాష్ట్రంలో 301 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయన్నారు. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్ లో కేసులు నమోదు అయ్యాయన్నారు. అక్కడ న్యూరాలజీ విభాగం మెరుగైన సేవలు అందించడమే ఇందుకు కారణం అన్నారు.
ఇది కూడా చదవండి: AP News: రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో జనం పరుగు
Hon'ble CM Shri @ncbn Garu held a review meeting on Guillain-Barre Syndrome (GBS) today. The meeting was attended by Hon'ble Minister of Health, Family Welfare and Medical Education, Shri Satya Kumar Yadav Garu and senior Health Department officials.#AndhraPradesh pic.twitter.com/lVmVlFxXqM
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 17, 2025
అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో చికిత్స..
రిఫరెన్స్ కేసులు ఎక్కువగా ఉండడంతో గుంటూరు జీజీహెచ్ లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. జీబీఎస్ బారిన పడిన వారికి సరిపడా ఇమ్యూనో గోబిలిన్ ఇంజక్షన్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. బీబీఎస్ బారిన పడ్డవారిలో 85శాతం మందికి చికిత్స లేకుండానే తగ్గిపోతుందన్నారు. ఈ వ్యాధికి సంబంధించి చికిత్స అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఉందన్నారు. సోకిన వారికి రోజుకు 5 ఇంజక్షన్ లు ఇవ్వాలని.. ఇందుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఐదు రోజుల పాటు ఈ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: Road Accident: అయ్యో ఘోరం: కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి!
మాజీ సీఎం జగన్ పై సత్య కుమార్ విమర్శలు చేశారు. జగన్ కేవలం పరామర్శలకే పరిమితం అయ్యారన్నారు. నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఇలా జైలుకు వెళ్లిన వారిని పరామర్శించడమే జగన్ పని అని అన్నారు. అభివృద్ధి ఎలా జరుగుతోందో వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. తనకు పదిమంది పీఏలు ఉన్నారని.. తన అనుచరులు దందాలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే.. రాజకీయాల్లో అదే తనకు చివరి రోజని సవాల్ విసిరారు.