ఏపీలో దారుణం.. టీచర్ల నిర్లక్ష్యంతో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి!

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అపర్ణ(12) అనే బాలిక జ్వరంతో చనిపోవడం కలకలం రేపుతోంది. 4 రోజులనుంచి తమ బిడ్డను టీచర్లు పట్టించుకోలేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

AP News: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. చందర్లపాడు మండలం గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని అనారోగ్యంతో చనిపోవడం కలకలం రేపింది. ఈ మేరకు చందర్లపాడు గ్రామానికి చెందిన కస్తాల అపర్ణ(12) అనే బాలిక ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే నాలుగు రోజుల నుంచి జ్వరంతో ఇబ్బందిపడుతోంది. టీచర్లకు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అలాగే  క్లాసులకు హాజరవుతోంది. 

జ్వరంతో బాధపడుతూనే క్లాసులకు..

ఈ క్రమంలోనే సోమవారం స్కూల్ వెళ్తున్న క్రమంలో కళ్ళు తిరిగి కిందపడిపోయింది. దీంతో వెంటనే స్పందించిన టీచర్లు.. చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అపర్ణ మృతి చెందింది. దీంతో బాలిక మృతిపట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య చికిత్సలు అందించకపోవడంతో తన కూతురు చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని స్కూల్ వద్ద నిరసనకు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు