DPT అంటే దోచుకో, పంచుకో, తినుకో: చంద్రబాబుపై జగన్ ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబు పై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలో మాఫీయా రాజ్యం నడుస్తోందని అన్నారు. ఇసుక ఉచితం అంటారు.. కానీ రెండింతల ధర పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. DPT అంటే దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే చంద్రబాబు పాలనలో ఉందని ఆరోపించారు.

New Update
JAGAN,

ఇసుక ఉచితం అంటారు.. కానీ రెండింతల ధర పెరిగిందని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో నూతన మద్యం, ఇసుక పాలసీని తీసుకువచ్చారని.. అయితే అందులో అంతా దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. దోచుకో, పంచుకో, తినుకో అనేదే సీఎం చంద్రబాబు పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పాలనపై జగన్ ఘాటు విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

ఏపీలో మాఫీయా రాజ్యం నడుస్తోంది

ఈ మేరకు సీఎం చంద్రబాబు పై జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలో మాఫీయా రాజ్యం నడుస్తోందని అన్నారు. ఇసుక ఉచితం అంటారు.. కానీ రెండింతల ధర పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 నెలలుగా సూపర్ సిక్స్ జాడే లేదు.. సూపర్ 7 కూడా లేదని అన్నారు.

ఇది కూడా చదవండి: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇది

కొన్ని ప్రాంతాల్లో లారీ ఇసుక రేటు రూ.60వేల వరకు ఉందని మండిపడ్డారు. DPT అంటే దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే చంద్రబాబు పాలనలో ఉందని ఆరోపించారు. మా హయంలో ఇసుక పాలసీ పారదర్శకంగా ఉండేదని చెప్పుకొచ్చారు. హామీలపై ప్రజలు నిలదీస్తారని భయపడి కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఫెమినా మిస్‌ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్‌లుగా నిలిచింది వీళ్ళే

ఇసుక, మద్యం సహా అన్నింట్లోనూ దోపిడీ కొనసాగుతోందని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుందంటున్నారు అని ఫైర్ అయ్యారు. మార్పు తీసుకొస్తున్నామంటూ స్కామ్‌లకు తెరలేపారని దుయ్యబట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు