ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఐరిస్‌ హాజరు!

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీ విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరును అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

New Update
sea

IRIS Attends: ఏపీ గవర్నమెంట్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరు అమలు చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరును అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

విద్యాసంస్థల్లో వివరాలు ఉండటం లేదు..

ఈ ఐరిస్ విధానం ద్వారా ఎంతమంది విద్యార్ధులు తరగతులకు హాజరవుతున్నారు? ఎంతమంది రెగ్యులర్‌గా కాలేజీలకు వస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ విధానంలో విద్యార్థుల హాజరు నమోదుచేసినప్పటికీ.. ఇటీవల ఈ విధానాన్ని నిలిపివేశారు. మరోవైటు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎలాంటి వివరాలు ఉండటం లేదు. దీంతో అన్నింటికీ ఐరిస్‌ హాజరు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
యాప్‌ ద్వారా ముఖ గుర్తింపు హాజరు నమోదుచేయనుంది.

ఒకేసారి ముగ్గురు, నలుగురి హాజరు..

తరగతిలో యాప్‌ ఆన్‌ చేసి, విద్యార్థి వద్ద పెడితే వివరాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఓకే చేస్తే హాజరు నమోదు పూర్తవుతుంది. ఒకేసారి ముగ్గురు, నలుగురి హాజరు నమోదుచేసేలా ప్రభుత్వం యాప్‌ను తీసుకొస్తోంది. అంతేకాకుండా బోధన రుసుముల చెల్లింపునకు కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కారణంగా విద్యార్థులకు ఆ స్థాయిలో హాజరు ఉండేలా ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. 

Also Read: బెయిల్ కోసం ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ దరఖాస్తు

Advertisment
Advertisment
తాజా కథనాలు