YS Sharmila: షర్మిల సంచలన నిర్ణయం!

AP: షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు నుంచి 28 వరకు విజయవాడలో ఉండనున్నారు. అన్ని జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.

New Update
YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 28 వరకు విజయవాడలోనే ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గ, మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. 2029 నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం సాధించే దిశగా  పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

Also Read :  మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్ రియల్ స్టోరీ.. 'అమరన్' ట్రైలర్ చూశారా

షర్మిల షెడ్యూల్..

  • ఈనెల 25న అరకు, విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాల నేతలతో సమావేశం.
    * ఈ నెల 26న కాకినాడ,అమలాపురం,రాజమండ్రి, నరసాపురం జిల్లాల నేతలతో సమావేశం.
    * ఈ నెల 27న ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ,గుంటూరు జిల్లాల నేతలతో సమావేశం.
    * ఈ నెల 28న నంద్యాల , కర్నూలు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నేతలతో సమావేశం.
    * నవంబర్ 6న బాపట్ల, నరసాపురం, అనంతపురం, హిందూపూర్ జిల్లాల నేతల సమీక్ష సమావేశం కానున్నారు.
    * నవంబర్ 7న కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.

Also Read :  ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘స‌త్యం సుంద‌రం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

అన్నతో ఆస్తి పంచాయితీ...

ఏపీ రాజకీయాల్లో అన్న, చెల్లెలి ఆస్తి పంచాయితీ చర్చనీయాంశమైంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో షేర్ల వివాదంపై మాజీ సీఎం జగన్ షర్మిలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడం ఒక్కసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.  కాగా దీనిపై అటు జగన్ కానీ.. షర్మిల కానీ.. విజయమ్మ కానీ స్పందించలేదు. కాగా తన చెల్లెకు ఆస్తిలో వాటా ఎగగొట్టేందుకు జగన్ చేస్తున్న కుట్ర అంటూ టీడీపీ.. గతంలో జగన్ కు షర్మిల రాసిన లేఖ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. టీడీపీకి కౌంటర్ గా వైసీపీ కూడా పోస్ట్ చేసింది. జగన్ గత పదేళ్లలో షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చారని.. చెల్లెలి మీద ప్రేమ లేకుంటే షర్మిలకు ఎందుకు అన్ని కోట్లు ఇస్తారని ప్రశ్నించింది. జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలో భాగంగా షర్మిలతో కలిసి టీడీపీ పన్నిన కుట్ర అంటూ వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. కాగా ఈరోజు జరిగే మీడియా సమావేశంలో షర్మిల దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Also Read :  కమీషన్లు మింగేశారా..?..కాళేశ్వరంపై ఓపెన్ కోర్టులో విచారణ

Also Read :  100 కి.మీ వేగంతో గాలులు..ఆ రెండు జిల్లాలకు అలర్ట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు