ఆ 21 ప్రధాన ఆలయాలకు ఛైర్మన్లు.. టీడీపీ నేతలకు చంద్రబాబు శుభవార్త!

రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్‌లను నియమించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. త్వరలోనే ఆ పదవులు భర్తీ చేస్తామన్నారు. TDP ఎమ్మెల్యేలు, మంత్రులతో ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

New Update
AP CM Chandrababu

AP CM Chandrababu

ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ఈ విషయాన్ని చెబితే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఈ రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లాల కో-ఆర్డినేటర్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలన్నారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదన్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో ఫోకస్ పెట్టాలని సూచించారు. పర్యటనల సంఖ్య పెరగాలన్నారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలన్నారు.
ఇది కూడా చదవండి: Nagababu Original Name: నాగబాబు అసలు పేరు ఇదే.. 40 ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్.. అంతా షాక్!

పార్టీలకు అతీతంగా పథకాలు..

సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని చంద్రబాబు తేల్చిచెప్పారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ పరమైన సంబంధాలు వేరని వివరించారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామన్నారు. పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదువుల కోసం అందించాలని సూచించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్‌లను నియమించనున్నట్లు చెప్పారు. నామినేటెడ్ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. మొదటి విడతలోనే పదవులు రాలేదని అనుకోవద్దన్నారు. రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. 
ఇది కూడా చదవండి: TTD: తిరుమలలో తెలంగాణ వారిపై వివక్ష.. ఇక ఊరుకునేదే లేదు.. రఘునందన్ సంచలన వ్యాఖ్యలు!

ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలన్నారు.  ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలన్నారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడం మన విధానమన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతీ గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలన్నారు. 2 కిలోవాట్‌ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనంగా అందిస్తామన్నారు.

కేంద్రం ఇచ్చే రాయితీతో కలిపి బీసీలకు రూ.80 వేల మేర రాయితీ వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల రూఫ్‌టాప్‌ల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రతీ ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్‌లో మీ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. కూటమిలోని మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు