సోషల్ మీడియా యూజర్లకు సీఎం వార్నింగ్.. అలా చేస్తే పీడీ యాక్ట్‌ కేసు!

సోషల్ మీడియా యూజర్లకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక, సంఘ విద్రోహ, వివాదాస్పద పోస్టులు పెడితే ఇకపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవినీతిపరులపై కూడా ఇదే తరహా కేసులు పెడతామన్నారు.

author-image
By srinivas
New Update
AP CM Chandrababu Naidu

AP News : సోషల్ మీడియా యూజర్లకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక, సంఘ విద్రోహ, వివాదాస్పద పోస్టులు పెడితే ఇకపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు పీడీ యాక్టు కేసుకు సంబంధించిన చట్టాల్లోనూ కీలక మార్పులు చేసేందుకు చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. మరో 10 నేరాలను ఇందులో చేర్చబోతున్నట్లు బాబు సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూకబ్జాలు, రేషన్‌ బియ్యం అక్రమాలు, రవాణా, విక్రయం, ఎగుమతులు వంటి నేరాలకు పాల్పడేవారిపైనా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయనుంది. 

Also Read :  మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..!

కర్నూలులో హైకోర్టు బెంచ్‌..

ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం ఏసీ సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతోపాటు కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ వంటి న్యాయ సంబంధిత సంస్థలను అక్కడే కొనసాగించాలన్న ప్రతిపాదనలు చేసింది.

ఇది కూడా చదవండి: గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్.. అతని అల్లునిపై కూడా..

ఇందులో భాగంగానే పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ప్రతిపాదనను ఆమోదించడంతోపాటు పర్యాటక ప్రాజెక్టులకూ పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మైక్రో ప్రాజెక్టులకు రూ.1.50 కోట్లు, మధ్యతరహా వాటికి రూ.7.5 కోట్లు, మెగా ప్రాజెక్టులకు రూ.25 కోట్లు, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు రూ.40 కోట్ల వరకు గరిష్ఠంగా రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోనూ థింసా వంటి ప్రత్యేక నృత్యాలు, కళలు, సంస్కృతులను ప్రోత్సహించాలని సూచించారు.  దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న హరియాణాను మించి ప్రోత్సాహకాలు ఇచ్చే కొత్త క్రీడల విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గంజాయి, మాదకద్రవ్యాల్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కొటిక్‌ టాస్క్‌ఫోర్స్‌కు ఈగల్‌ (ఎలైట్‌ యాంటీ నార్కొటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) అని పేరు పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. 

Also Read :  మానవత్వం మంటగలిసింది.. కాపాడండి బాబూ అంటున్నా కనికరించలేదు!

Also Read :  నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లారో బుక్కవ్వడం ఖాయం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment