/rtv/media/media_files/2025/02/07/6UcmwhuUsbtoHX5vSo1Z.jpg)
Chandrababu Tweet Over Pawan Kalyan Ministry
నిన్న ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మంత్రులకు ర్యాంకులు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో చంద్రబాబుకు 6, లోకేష్ (Nara Lokesh) కు 8, పవన్ (Pawan Kalyan) కు 10 వ ర్యాంకు దగ్గింది. అయితే.. పవన్ కు 10వ ర్యాంకు ఇవ్వడం ఏంటన్న విమర్శలు జనసేన నుంచి వ్యక్తం అవుతున్నాయి. పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి చంద్రబాబు స్పందించారు. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదన్నారు. ఇది ఎవరినీ తక్కువ చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Also Read : ప్రాణం మీదకు తెచ్చిన బొబ్బర్లు.. గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం!
అభివృద్ధి వైపు అడుగులు..
ఆ ట్వీట్లో చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. ''ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే...మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం.
ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం.… pic.twitter.com/sRpCrO9Xdy
— N Chandrababu Naidu (@ncbn) February 7, 2025
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప...విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన.
Also Read : మా తమ్ముడితో సంబంధం పెట్టుకుంటావా?.. అక్క ఎంత దారుణంగా చంపిందంటే..!
అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది.
‘పీపుల్ ఫస్ట్’ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాము. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి... సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను.''
Also Read : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే!
Also Read : ఉరేసుకున్న మహిళ.. తలుపులు బద్దలు కొట్టి కాపాడిన పోలీసులు