నేరస్తుడికి మరణశిక్ష పడాలి: చంద్రబాబు ఆగ్రహం

కడప జిల్లా బద్వేలులో పెట్రోల్‌ దాడిలో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు.

New Update
chandrababu

కడప జిల్లా గోపవరం మండలంలో శనివారం దారుణం జరిగింది. సెంచురి ఫ్లైవుడ్‌ కంపెనీ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఏకంగా ఐదుగురు నిందుతులు ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశారు. అనంతరం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో మంటల్లో కాలిపోతున్న ఆ విద్యార్థిని కేకలు వేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. వెంటనే విద్యార్థినిని చికిత్స నిమిత్తం బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ 

ఇక చికిత్స పొందుతూ ఆ విద్యార్థిని ఇవాళ (ఆదివారం) మరణించింది. కడప రిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. కాగా నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే.. మిగతావారు భయపడతారని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి:  ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

చంద్రబాబు విచారం

అయితే ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడి ఘటనలో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అంతేకాకుండా నేరస్థుడికి మరణశిక్ష స్థాయిలో శిక్ష పడేలా చూడాలని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా రియాక్ట్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు!

 ప్రాణాలు కోల్పోవడం బాధాకరం

కడప జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం అని ఆయన అన్నారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరమన్నారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

మరణశిక్ష స్థాయి శిక్ష పడాలి

ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించానని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే.. హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమే అని తెలిపారు. అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానని అన్నారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించానని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు