వివేకా హత్య జరిగిన రోజు అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పిన చంద్రబాబు!

వివేకా హత్య కేసు.. నేరస్థులు ఎలా ట్రాప్ లో పెడతారనే విషయం చెప్పేందుకు ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీత కోరకపోతే పోస్టుమార్టం లేకుండానే వివేకా హంత్యక్రియలు జరిగేవన్నారు. వివేకాది గుండెపోటు అని నమ్మించే ప్రయత్నాలు చేశారన్నారు.

New Update

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్థులు ఎలా ట్రాప్ లో పెడతారనేందుకు వివేకా హత్య ఒక ఉదాహరణ అని అన్నారు. ఆ రోజు ఉదయాన్నే వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందన్నారు. తాను కూడా నిజమేనని నమ్మానన్నారు. మధ్యాహ్నానికి పోస్టు మార్టం చేయాలని వివేకా కూతురు సునీత అడిగారన్నారు. ఏ టీవీలో గుండెపోటు అని చెప్పారో... వారే సాయంత్రానికి మాట మార్చారన్నారు. నారాసుర రక్తచరిత్ర అని తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామని ధీమా వాళ్లదని ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాల మరక అంటకుండా 45 ఏళ్లు రాజకీయాలు చేశానన్నారు. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసినా.. ప్రజా క్షేత్రంలో పోరాడి అలాంటివారిని శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేశానన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు-ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే సాగనివ్వనని హెచ్చరించారు.

Advertisment
Advertisment
Advertisment