Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి,దానికి ఆనుకొని తీవ్ర అల్పపీడనం తన దిశ మార్చుకుంది.ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతిగా పయనించిన తర్వాత వాయవ్యంగా పయనం మొదలు పెట్టింది. ఈ అల్పపీడనం దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడుకు సమీపంలో ఉంది. ఈ అల్పపీడనం ఇవాళ వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య.. దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. Also Read: South Korea: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం ఈ ప్రభావంతో గురువారం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా, నంద్యాల, బాపట్ల, పల్నాడు,అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. Also Read: Cinema: ఇద్దరు మేనేజర్లను తొలగించిన చిరంజీవి.. అసలేం జరుగుతోంది? బుధవారం తిరుపతి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల వంటి జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతున్నాయని అధికారులు వివరించారు. అలాగే తీర ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా కనిపించింది. అయితే బుధవారం విశాఖపట్నం, కళింగపట్నం, తుని, బాపట్ల, నందిగామ, గన్నవరం, జంగమేశ్వరపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. Also Read: భార్యను చూసుకునేందుకు రిటైర్మెంట్ తీసుకున్న భర్త.. చివరికి ఊహించని షాక్ ఇదిలా ఉంటే.. ఈ నెల 27 తర్వాత అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో వర్షాల కారణంగా వరి పంట కోతకు వచ్చే సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: Delhi: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం ఈ వర్షాల కారణంగా వ్యవసాయాధికారులు రైతులకు కొన్ని సూచనలు చేశారు. అన్నదాతలు వరి కోతల పనుల్ని వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు వరి కోత దశలో ఉన్న పొలాల్లో వర్షం నీరు చేరకుండా రైతులు గట్లు కట్టుకొంటున్నారు. అలాగే ఇప్పటికే కోసిన వరి పంటను కట్టలు కట్టి కుప్పలు వేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. పంటను నూర్చేందుకు సిద్దంగా ఉన్న సమయంలో వరుస అల్పపీడనాలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. కొంతమంది రైతులు ధాన్యాన్ని హైవేరోడ్ల మీద ఆరబెడుతున్నారు. వర్ష సూచనతో పరదాలు కప్పి ధాన్యాన్ని రక్షించుకుంటున్నారు.