/rtv/media/media_files/2025/04/03/tORwLcEaFfuMFTkNbts1.jpg)
AP Registrations
రిజిస్ట్రేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. జిల్లాలోని అన్ని రిజిస్ట్రార్ కేంద్రాల్లో శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ విధానంలోనే కొనసాగుతాయి. స్లాట్ బుకింగ్‌లకు డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను పాటించాలి.
ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
ఏపీలో రిజిస్ట్రేషన్లు ఇకపై స్లాట్ బుకింగ్ విధానంలో జరగనున్నాయి. జిల్లాల్లోని రిజిస్ట్రార్ కేంద్రాల్లో శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. అధికారిక వెబ్‌సైట్ లేదా కార్యాలయాల్లో క్యూఆర్‌కోడ్ స్కాన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
— RTV (@RTVnewsnetwork) April 3, 2025
Read More>>…
ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం
స్లాట్ బుకింగ్ బట్టి రిజిస్ట్రేషన్..
స్లాట్ టైమ్ బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంతకు ముందు మంచి, చెడు ముహూర్తాలు చూసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. ఈ స్లాట్ బుకింగ్ వల్ల ఇకపై అలా జరగదు. అయితే పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) పద్దతి ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్యూఆర్‌కోడ్ స్కాన్ అందుబాటులో ఉంటుంది. ఇలా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
ఈ సమయాల్లో మాత్రమే..
గతంలో సమయం సందర్భం లేకుండా అర్థరాత్రి కూడా రిజిస్ట్రేషన్లు చేసేవారు. కానీ ఇకపై అలా జరగదు. రాష్ట్రంలోని 26 జిల్లా ప్రధాన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ కోసం అపాయింట్‌మెంట్ పొందవచ్చు.
ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!