AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

AP Government : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.  గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఉచితంగా న్యూస్‌పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించి దానికి ప్రభుత్వం అదనంగా రూ.200 అలవెన్సు ఇచ్చేది.

Also Read: దసరా వేళ టీజీఆర్టీసీ తీపి కబురు..ఇక నుంచి ఇంటింటికి..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‌ ఈ అదనపు అలవెన్సులు రద్దు చేసింది.  ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అలవెన్సుల పేరుతో ఆర్థిక దుర్వినియోగం జరుగుతోందన్నారు. అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు అందించే సాయాన్నిఆపేయాలనే ప్రతిపాదనల్ని ఆమోదించింది. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana Rains : తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షాలు!

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి- భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో తెల్లవారు జామునుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పంటలు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
 Heavy rains in Telangana.

Heavy rains in Telangana.

Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి- భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో తెల్లవారు జామునుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పంటలు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. శివారు ప్రాంతాలైన ఘట్‌కేసర్‌, చర్లపల్లి తదితర ఏరియాల్లో మోస్తరు వర్షం పడుతోంది. 

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

తెలంగాణలో హైదరాబాద్, కొన్ని జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం వేళల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎండవేడిమి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చు, కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.ఈ ఆదివారం ఉదయం వేళనుంచి ఉత్తర తెలంగాణలో కొంత మోస్తరు వానలు కురుస్తున్నాయి. తిరిగి సాయంత్రం వేళ హైదరాబాద్, ఆ చుట్టుపక్కల వాన మొదలై.. రాత్రి 8 గంటల వరకూ కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణపై రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. గాలి వీచినప్పుడు ఉపశమనంగా ఉంటుంది.

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం.. ఈ ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఎండ కూడా వస్తూ ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో వాన మొదలై.. క్రమంగా పెరుగుతూ.. భారీ వర్షంగా మారి.. రాత్రి 7 వరకూ కురిసే అవకాశాలు ఉన్నాయి. రాత్రి 8 తర్వాత పశ్చిమ రాయలసీమలో జల్లులు పడే ఛాన్స్ ఉంది. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 18 కిలోమీటర్లుగా ఉంది.

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

 ఏపీలో గంటకు 11 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఏపీలో ఉత్తరాంధ్రలో 35 డిగ్రీల సెల్సియస్, కోస్తాలో 38, రాయలసీమలో 40 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. తెలంగాణలో 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. చెప్పాలంటే ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రతలు కొంత తక్కువగానే ఉంటాయి.

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Advertisment
Advertisment
Advertisment