Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!

ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్‌ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.

New Update
ap rains

ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ  కేంద్ర అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనం బలపడి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందని తెలిపారు. ఇది తుపానుగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

Also Read:  తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష

AP Rains

నాలుగు రోజుల పాటూ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా . ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్‌ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.  అలాగే చిత్తూరు జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు.

Also Read: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..

అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణింకి కూర్మనాథ్‌ అన్నారు. బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:  ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

అలాగే ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి.. పునరావాస కేంద్రాలను వెంటనే సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే జిల్లాలో సెలవుల్లో ఉన్న సిబ్బంది , అధికారులు వెంటనే విధుల్లో చేరాలని చెప్పారు. అలాగే నాలుగు రోజులపాటు జలపాతాలు వద్దకు, బీచ్‌లకు పర్యాటకులకు అనుమతి ఉండదు. భారీ వర్షాల కారణంగా సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కారవేదికను కూడా రద్దు చేశారు.

Also Read: Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

అలాగే పర్యాటక కేంద్రమైన తలకోనకు ఎవరూ రావొద్దని పోలీసులు కోరారు. నాలుగు రోజులపాటు పర్యాటకులకు అనుమతి నిలిపివేసినట్లు తెలిపారు. తలకోన జలపాతంతో పాటు మాకలరేవు, ధనువు తీసిన బండ ప్రాంతాలకు పర్యాటకులకు అనుమతి లేదు. ఇటు తిరుపతి జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు.. పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

వేటకు వెళ్లొద్దు...


సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే అవకాశాలుండడంతో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు , పశువుల కాపరులు చెట్ల కింద కానీ, స్తంభాల వద్ద కానీ,ఖాళీ ప్రదేశాల్లో కానీ ఉండరాదని సూచించారు.

నైరుతి తిరోగమనం...

మహరాష్ట్ర,గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఒడిశా,అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ , మణిపూర్‌, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌ తో పాటు ఉత్తర బంగాళాఖాతం నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలుగుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేందుకు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment