/rtv/media/media_files/2025/02/28/L4HG85G5gNWf94EYy1Id.jpg)
Andhra Pradesh Budget 2025-26 special focus on Telugu language
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అందులో తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. తెలుగు భాషాభివృద్ధికి దాదాపు రూ.10 కోట్లు కేటాయించడం విశేషం. అందులో నవోదయం 2.0 స్కీం కింద మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం కేటాయింపు చేసారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయమే ధ్యేయంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
ఇదిలా ఉంటే రూ.3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రూ.48 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపొందించారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి రూ.3 లక్షలు కోట్లు దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ.3 లక్షల కోట్లు దాటినట్లు సమాచారం. ఇక ఇందులో పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు కేటాయింపులు చేశారు.
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్
2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్టులో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక విధాన ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రగతికి పరుగులు పెట్టించేలా వివిధ విధాన నిర్ణయాలు ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గనుందనే చెప్పాలి.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!
కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాల్టీలకు విముక్తి కల్పించారు. 2024 ఏప్రిల్ నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాల్టీలకు స్వేచ్ఛ ఇచ్చారు. కాగా గత ప్రభుత్వం.. మున్సిపాల్టీల్లోని చిన్నపాటి పనులకు బిల్లుల చెల్లింపులను ఆ శాఖ సెక్రటరీ ఆమోదం తెలిపే విధానాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు.
ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెడించర్ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులకు నిర్ణయించారు. ప్రోత్సాహకంగా ప్రాజెక్టులో 20 శాతం మేర వయబులిటి గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం స్కీం డిజైన్ చేసింది. ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీం కోసం రూ.2వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయించారు.