/rtv/media/media_files/2025/01/12/NUHS6eqRXltv2o4Sv6qW.jpg)
Jagan Pawan Chandrababu
గోరంతను కొండంతగా చేసి చూపించడంలో చంద్రబాబు నాయుడిని పవన్ కల్యాణ్ మించిపోయాడని వైసీపీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఉదయం పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కింద కేవలం 1800 కిలో మీట్లర్లు మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 3,750 కి.మీ మేర సీసీ రోడ్లను నిర్మించారన్నారు. ఇంకా గత ఐదేళ్ల పాలనలో కేవలం 268 మినీ గోకులాలు ఏర్పాటు చేస్తే తాము ఆరు నెలల్లోనే 22,500 నిర్మించామన్నారు. ఇంకా పీవీటీజీ ఆవాసాల కోసం గత వైసీపీ సర్కార్ కేవలం రూ.91 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు వెచ్చించిందన్నారు. ఈ ట్వీట్ పై వైసీసీ రియాక్ట్ అయ్యింది. అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేయడంలో పవన్ తన గురువు చంద్రబాబును మించిన శిష్యుడయ్యాడని సెటైర్లు వేసింది.
ఇది కూడా చదవండి: తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు!
గోరంతను కొండంతగా చేసి చూపించడంలో @ncbn ను మించిపోయారు @PawanKalyan.
— YSR Congress Party (@YSRCParty) January 12, 2025
అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేయడంలో కూడా గురువును మించిన శిష్యుడయ్యాడు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లలో గుంతలను పూడ్చడమే కానీ
రోడ్లు వేసింది మాత్రం శూన్యమనే చెప్పాలి.
గుంతలు… https://t.co/W2NoKasrfj
కొత్త రోడ్లు వేయలేదు..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లలో గుంతలను పూడ్చడమే కానీ కొత్త రోడ్లు వేసింది శూన్యమేనన్నారు. ఈ ప్రభుత్వం గుంతలు పూడ్చడానికి ఖర్చు చేసింది కేవలం రూ.860 కోట్లు మాత్రమేనన్నారు. కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుందన్నారు. పీపీపీ విధానంలోనే కొత్త రోడ్లను నిర్మిస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించి తద్వారా వాహనదారుల నుంచి భారీగా టోలు ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ఆ ముసుగులో టీడీపీ పెద్దలే కాంట్రాక్టర్లుగా మారి టోలు బాదుడుకు సిద్ధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: పేదలకు చేయూత.. సంక్రాంతి పండక్కి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రూ.43 వేల కోట్లు ఖర్చు..
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఏడాది కోవిడ్‌కు పోగా కేవలం 4 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.43 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.4,648 కోట్లు ఖర్చను తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని వైసీపీ తన పోస్ట్ లో పేర్కొంది. రోడ్ల గుంతలు పూడ్చటం మాత్రమే కాదు.. వాటితో పాటు పెద్ద సంఖ్యలో జగన్ సర్కారు కొత్త రోడ్లను నిర్మించిందని తెలిపింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని సూచించింది.