AP Govt: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త!

ఏపీలో భవనాలు, లేఅవుట్ల పర్మిషన్లను సులభరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అంతస్తుల వరకు నిర్మాణాల కోసం లైసెన్సుడ్‌ సర్వేయర్‌ ద్వారా అనుమతిలిచ్చే కొత్త విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
babau 2

ఏపీలో భవనాలు, లేఅవుట్ల పర్మిషన్లను సులభరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అంతస్తుల వరకు నిర్మాణాలు చేసుకునేందుకు లైసెన్సుడ్‌ సర్వేయర్‌ ద్వారా అనుమతిలిచ్చే కొత్త విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. దీంతో 95 శాతం మంది ప్రజలకు అనుమతుల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని సర్కార్ భావిస్తోంది. భవనాలు, లేఅవుట్ల పర్మిషన్లకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనుంది. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 

Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?

Construction Of Buildings

''ఐదు అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన లైసెన్సుడ్‌ సర్వేయర్ల ద్వారా పర్మిషన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. సర్వేయర్లే ప్లాన్‌ అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి డబ్బులు చెల్లించిన వెంటనే పర్మిషన్ ఇచ్చేలా ఏర్పాటు చేశాం. నిర్మాణం ప్రారంభించాక పునాదుల దశ ఫొటోలను సర్వేయర్లే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనుమతులకు విరుద్ధంగా ఎవరైనా పనులు చేపడితే సర్వేయర్ లైసెన్స్‌ను రద్దు చేస్తాం. క్రిమినల్ కేసులు కూడా పెడతాం. 

Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!

రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయినవాళ్లు అదే ప్రాంతంలో అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ఇకనుంచి టీడీఆర్ బాండు అవసరం లేదు. స్థలం కోల్పోయినట్లు అధికారుల ధ్రువీకరణ ఆధారంగా పర్మిషన్ ఇస్తారు. వీళ్లు వేరే చోట చేపట్టే అదనపు అంతస్తుల నిర్మాణానికి టీడీఆర్‌ బాండు తప్పనిసరి. భవన అనుమతులకు సంబంధించి సింగిల్‌ విండో విధానం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వస్తుంది. 

Also Read: ఏక్‌నాథ్ షిండే సంచలనం.. సీఎం పోస్ట్ నుంచి ఔట్!

రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎయిర్‌పోర్ట్‌, అగ్నిమాపక, మైనింగ్, జనవనరులు, రైల్వేశాఖ నుంచి మున్సిపల్ ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా పర్మిషన్లు వచ్చేలా ఏర్పాటు చేశాం. 500 చదరపు అడుగులు దాచిన నివాస భవనాలకు సెల్లార్ పార్కింగ్‌ పర్మిషన్ ఇవ్వాలన్న ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. 120 మీటర్ల కంటె ఎత్తయిన భవనాల సెట్‌బ్యాక్ పరిమితిని 20 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎత్తయిన భవనాల్లో పార్కింగ్ పోడియాన్ని 5 అంతస్తుల వరకు పర్మిషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 10 అంతస్తుల కంటే ఎత్తయిన భవనాల్లో రిక్రియేషన్ కోసం ఒక అంతస్తు ఉండేలా పర్మిషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలనూ కూడా ఆమోదించారు. ఇకనుంచి లేఅవుట్లలో 9 మీటర్ల వెడల్పులో రోడ్లు వదిలేలా వెసులుబాటు కల్పించామని'' మంత్రి తెలిపారు.   

Also Read: TTD:శ్రీవారి భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌..పదిరోజుల పాటు ఆ దర్శనాలు రద్దు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment