/rtv/media/media_files/2025/01/08/XtAvpF5CchLOBMiST83K.jpg)
sankrati
సంక్రాంతి పండగ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ.ఏపీలో ఈ పండుగను మరింత ఘనంగా, అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వృత్తి ఉద్యోగాల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా ఈ పండగకు సొంతూర్లకు వచ్చి.. పండగ చేసుకుంటారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడి పందేలు, హరిదాసు కీర్తనలతో పల్లెల్లో సందడి వాతావరణం ఉంటుంది.
Aslo Read: Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు
అయితే ఏపీలోని ఓ గ్రామం మాత్రం సంక్రాంతి పండగను జరుపుకోవడం లేదు. పండగ జరుపుకోవడం పక్కనపెడితే కనీసం స్నానాలు కూడా చేయరు. ఇళ్లు కూడా ఊడ్చుకోరు. .సంక్రాంతి పండగ అంటే పల్లెల్లో ఎంతో సందడి ఉండగా.. ఏపీలోని అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామంలో మాత్రం అసలు పండగ వాతావరణమే కనిపించదు. దేశమంగా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోతుండగా.. పి.కొత్తపల్లి వాసులు మాత్రం మామూలు రోజుకంటే సాధారణంగా ఉంటారు.
సంక్రాంతి పండగ ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం కాదు కదా.. ఆ రోజు కనీసం ఇంటిని కూడా ఊడ్వకపోవడం గమనార్హం. ఆత్మకూరు నుంచి కల్యాణదుర్గం వెళ్లే మార్గంలో ఈ పి.కొత్తపల్లి గ్రామం ఉంటుంది.ఈ క్రమంలోనే దాదాపు 300 కుటుంబాలు కమ్మ, బోయ, ఎస్సీ కుటుంబాలు ఉంటాయి. ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం లేదు. సంక్రాంతిని ఎందుకు జరుపుకోవడం లేదంటే.. ఆ పి.కొత్తపల్లి గ్రామస్తులు తమ పూర్వీకులు చెప్పిన ఒక కథను ఒకదానిని చెబుతుంటారు.
Also Read: Horoscope : ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు దక్కుతుంది!
వెళ్లిన వాళ్లు.. వెళ్లినట్లే..
చాలా సంవత్సరాల క్రితం పి.కొత్తపల్లి గ్రామంలో కూడా అందరిలాగానే సంక్రాంతి పండగను జరుపుకునే వారని.. అయితే అలా ఒకసారి సంక్రాంతి పండగ కోసం సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి ఆత్మకూరు సంతకు వెళ్లగా...అక్కడ ఉన్నట్టుండి ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.అయితే ఈ ఘటనను అందరూ సాధారణ ఘటనగానే భావించారు. కానీ ఆ తర్వాతి రోజు అలాగే సంతకు వెళ్లిన మరో ముగ్గురు కూడా అలానే మరణించారు. దీంతో ఆ గ్రామస్థుల్లో భయం మొదలైంది. ఆ తర్వాత వరుసగా పండగకు సంతకు వెళ్లిన వాళ్లు.. వెళ్లినట్లే ప్రాణాలతో తిరిగి రాకపోవడంతో వారికి సంక్రాంతి అంటే భయం మొదలైంది.
అప్పటి నుంచి సంక్రాంతి పండుగ చేసుకుంటే తమ గ్రామస్థులకు ఏదో ఒక అనర్థం జరుగుతుందని గ్రామవాసులు భయపడిపోయారు. అప్పట్నుంచి తమ ఊళ్లో సంక్రాంతి పండగను జరుపుకోవద్దని గ్రామపెద్దలు తీర్మానించుకున్నారు.అయితే ఎన్నో తరాలు మారినప్పటికీ.. అప్పుడు తమ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని పి.కొత్తపల్లి గ్రామస్థులు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు.
తమ పూర్వీకులు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ వారు ఇప్పటికీ సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజుల పాటు ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకోరు. ఇంటి ముందు ముగ్గులు వేయరు. పిండి వంటలు చేసుకోరు. కనీసం స్నానాలు కూడా చేయరు.
Also Read: Madhya Pradesh: ఇక నుంచి రాష్ట్రంలో ఆ పట్టణాల్లో మద్యం బంద్!
Also Read: South Korea: అభిశంసనకు గురైనా..ఆ అధ్యక్షుడి జీతం పెరిగిందోచ్!