/rtv/media/media_files/2025/04/05/MYj09EnosAQFYrqQnqYN.jpg)
Alekhya Chitti say sorry to customers after Alekhya Chitti Pickles Issue
గత రెండు రోజులుగా అలేఖ్య చిట్టి పికెల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. పచ్చళ్ల రేటు ఎక్కువగా ఉందని అడిగినందుకు అలేఖ్య కస్టమర్లపై బూతులతో రెచ్చిపోయింది. నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఆడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అలేఖ్యపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్
కస్టమర్లే మా దేవుళ్లు అని వీడియోలలో చెప్తూనే.. నిజ జీవితంలో అలేఖ్య బూతులతో రెచ్చిపోయిందని ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా మీమ్స్, ట్రోలింగ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. వీడియోల్లో కనిపించే అలేఖ్య వేరు.. రియల్ లైఫ్‌లో అలేఖ్య వేరు అంటూ మండిపడుతున్నారు. జీవితంలో ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలే తప్ప తలపొగరు చూపించకూడదని హితవు పలుకుతున్నారు.
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అయితే ఈ వివాదాన్ని సర్దుమనిగించేందుకు అలేఖ్య అక్కా, చెల్లెలు రంగంలోకి దిగారు. అలేఖ్య అలా బూతులు తిట్టడం వెనుకున్న ఆంతర్యాన్ని వారు తెలిపారు. వారు ఎంత వివరణ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగడం లేదు. నెటిజన్లు ఏ మాత్రం కన్విన్స్ అవ్వడం లేదు. అలేఖ్యకు సంబంధించిన పాత వీడియోలను బయటకు తీసి వైరల్ చేస్తున్నారు.
Also read: గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
ఈ నేపథ్యంలో వారు తమ బిజినెస్‌ను మూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. వెబ్‌సైట్, యాప్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అనేక సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసుకున్నారు. వారి బిజినెస్‌కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంట్రవర్సీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మళ్లీ బయటకు రావాలని చూస్తున్నట్లు సమాచారం.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
Alekhya Chitti Pickles apologized in a video for scolding and making vulgar comments toward multiple customers, as implied by her use of the plural "andarini."
— Laxmi Tweets (@Laxmi_Tweets_9) April 5, 2025
Under Consumer Protection Act, she could face a significant fine for such behavior#AlekyaChittiPickles #AlekyaChitti pic.twitter.com/hCX7K1ltA4
నన్ను క్షమించండి
అయితే ఈ వివాదాన్ని త్వరగా క్లోజ్ చేసేందుకు డైరెక్ట్‌గా అలేఖ్య రంగంలోకి దిగింది. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరింది. ఈ మేరకు తాను ఒక వీడియో రిలీజ్ చేసింది. ‘‘నేను తప్పు చేశాను. ఇప్పటి వరకు ఎవర్ని అయితే తిట్టానో.. వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను’’ అంటూ ఆ వీడియోలో పేర్కొంది. మరి ఇప్పటికైనా అలేఖ్య చిట్టి వ్యవహారం కంట్రోల్ అవుతుందో లేదో చూడాలి.
(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)