/rtv/media/media_files/2025/04/06/jQcrF97xDKQYyl0vF1y0.jpg)
Alekhya Chitti crying after Alekhya Chitti Pickles Issue Video goes viral
గత మూడు రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. పికిల్స్ రేటు ఎక్కువగా ఉందన్న పాపానికి అలేఖ్య.. తన కస్టమర్లపై బూతులతో విరుచుకుపడింది. ముష్టి పచ్చళ్లే కొనలేనపుడు మీకు పెళ్లం ఎందుకు?.. లవర్ ఎందుకు అంటూ బూతుపురాణం మొదలెట్టింది. అందుకు సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలేఖ్య చిట్టిపై నెట్టింట దుమారం రేగింది.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
వెక్కి వెక్కి ఏడ్చిన అలేఖ్య
దీంతో ట్రోలర్స్, మీమర్స్ అలేఖ్య చిట్టి పికిల్స్‌ను టార్గెట్ చేశారు. వరుసగా ట్రోల్స్, మీమ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. దీంతో బిజినెస్‌ను మూసేసి అలేఖ్య చిట్టి అన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వ్యతిరేఖతకు ఆమె కుంగిపోతుంది. తాజాగా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
Papam... Don't troll her 🥺🥺 pic.twitter.com/dulDHgKMjr
— Sandhya Reddy YSCRP 🇱🇸 (@SandhyaSamayam) April 5, 2025
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ఇలాంటి సమయంలో నాన్న ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేదాన్ని అంటూ ఏడుస్తుంది. పక్కనే తన సోదరి అలేఖ్య కన్నీళ్లు తుడుస్తూ ఏడవకు.. ఏడవకు అంటూ ఆమెను ఓదార్చుతుంది. ప్రస్తుతం అందుక సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. నోరు జారక ముందు ఆ ఆలోచన ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరొకరేమో.. అయిందేదో అయిపోయింది అని రాసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio leaked | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)