Agniveer: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే?

ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ వెల్లడైంది. కడపలోని(Guntur) డీఎస్ఏస్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. నవంబర్10 నుంచి 15 వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

New Update
gunturu rally

రాష్ట్రంలో నిరుద్యోగ యువతుకు గుడ్ న్యూస్. ఎప్పట్నుంచో అగ్నివీర్ లో చేరాలనుకుంటున్న వారు ఇక సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెన్త్ ట్రేడ్స్‌మెన్, అగ్నివీర్ 8th ట్రేడ్స్ మెన్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండిః మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

ర్యాలీ ఎప్పుడు

ఈ ర్యాలీని కడపలోని డీఎస్ఏ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. నవంబర్ 10 నుంచి 15 తేదీ వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా ఈ ర్యాలీలో 13 జిల్లాల్లోని అభ్యర్థులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:  రేవంత్‌ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?

ఈ జిల్లా అభ్యర్థులకు మాత్రమే చాన్స్

అందులో కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, చిత్తూరు, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు కచ్చితంగా అడ్మిట్ కార్డులు తీసుకురావాలని అన్నారు.

Also Read:  కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!

02.12.2024 నాటి నోటిఫికేషన్ ప్రకారం www.joinindinaarmy.nic.inలో పొందుపరచిన అన్ని డాక్యుమెంట్స్ ను తీసుకురావాలన్నారు. అయితే ఈ ర్యాలీలో అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ లో భాగంగా 1600 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. అందులో దాదాపు 1000 మంది చొప్పున అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ ఇవ్వనున్నారు. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. 

ఇది కూడా చదవండి: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Advertisment
Advertisment
తాజా కథనాలు