అఘోరీ ఎపిసోడ్ రచ్చకెక్కింది. ఇప్పటి వరకు అఘోరీ-శ్రీవర్షిణి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అఘోరీయే నా మొదటి భర్త అంటూ ఓ మహిళ మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది. అఘోరీ తననే మొదట పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాతే శ్రీవర్షిణీని పెళ్లి చేసుకున్నాడని ఆ మహిళ చెబుతోంది.
Also Read : కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
వర్షిణీని పెళ్లి చేసుకుంటానన్న విషయం చెప్పి.. గత నెల మార్చిలో తన వద్దకు వచ్చి మెడలో ఉన్న తాళిని తీసుకుని వెళ్లిపోయాడని పేర్కొంది. అది మాత్రమే కాకుండా ఆమెతో అఘోరీ మాట్లాడిన ఒక ఆడియో కాల్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అఘోరీ తాజాగా స్పందించింది.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
అఘోరీ ఫస్ట్ రియాక్షన్
‘‘రాధ అనే మహిళ ఒక లాయర్. ఆమెకు గతంలో మ్యారేజ్ అయింది. ఆమె భర్త వేరొకరితో వెళ్లిపోయాడు. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ డిప్రెషన్ లోకి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ నాకు చెప్పింది. తన భవిష్యత్తును కాపాడమని కోరింది. తనకు కాస్త తోడుండమని చెప్పింది.
అలా నన్ను అప్రోచ్ అయిన తర్వాత.. నేను ఆమెను కలిసాను. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు. నేను ఆమెకు తాళి కట్టాను అనేది పూర్తిగా అవాస్తవం. నేను జనవరి 1న మధ్య ప్రదేశ్ లో ఉన్నాను. ఇప్పుడు ఆమె నామీద చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలు. నేను తాళి కట్టాను అని చెబుతుంది. దానికి ఏమైనా ప్రూఫ్స్ చూపించండి. పసుపు తాడు కడితే పెళ్లి కాదు.. ప్రూఫ్స్ ఉంటే చూపించండి. మరో విషయం ఏంటంటే.. ఆమె నా ఆడియో రికార్డింగ్ ఒక్కటే పెడుతుంది. మరి ఆమె మాట్లాడింది ఎందుకు పెట్టడం లేదు.
Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
స్వామి నువ్వు నాకు తోడుండు. నీకు ఆశ్రమం కడతాను. నన్ను కాపాడుకో అని ఆమె నాతో చెప్పింది. ఇవన్నీ ఏ ఉద్దేశంతో అన్నావు. నేను లవ్ యు మిస్ యు అనేది కామన్ గా ఉపయోగించే పదం. అందరినీ ప్రేమగా చూసుకోవడం కోసమే నేను అలా మాట్లాడతాను. అయినా ఆమె ఇప్పటి వరకు బయటకు రానిది.. ఇప్పుడు నేను వర్షిణీని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు ఎందుకు వచ్చింది. ఆమె డిప్రెషన్ లో చచ్చిపోతా అన్నప్పుడు సర్లే తాళి కడతాను అని చెప్పానే తప్ప.. తాళి కట్టలేదు.’’ అని అఘోరీ చెప్పుకొచ్చింది.
(Aghori Sri Varshini Lov | Aghori First Wife | latest-telugu-news | telugu-news)