/rtv/media/media_files/2025/02/12/D9ACXLyrigvtMzKSwTDc.jpg)
Janasena Leader Kiran Royal
Kiran Royal: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్.. ఈ మధ్య కిరణ్ రాయల్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్ చల్ చేయడం.. వాటికి ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే, నా మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ సోషల్ మీడియా వంద కోట్లు ఖర్చు చేసిందని కిరణ్ ఆరోపించారు.. రాష్ట్రం మొత్తం నన్ను తప్పుగా చూపిస్తూ.. పార్టీని డ్యామెజ్ చేయాలని కుట్ర పన్నారు.. ఎన్నికల ముందు లక్ష్మీతో అభినయ్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు.. కిరణ్ రాయల్ కు తిరుపతి సీటు వస్తే.. అప్పుడు ఇలాంటి ప్రచారం చేయాలి.. పది కోట్లు ఇస్తామని లక్ష్మీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు అభినయ్ రెడ్డి అని విమర్శించారు..వైసీపీ ట్రాప్ లో పడిన లక్ష్మీరెడ్డి జైపూర్ జైల్లో ఊచలు లెక్కిస్తోందన్నారు. లక్ష్మీరెడ్డితో భూమన అభినయరెడ్డికి అక్రమసంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాల సందర్శన.. కారణం అదే.. పవన్ కీలక ప్రకటన!
క్రికెట్ బెట్టింగ్, రమ్మీ గేమ్, చీటింగ్, ఫ్రాడ్ లో లక్ష్మీరెడ్డి దిట్ట అని కీలక ఆరోపణలు చేశారు. నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే భూమన అభినయరెడ్డి లక్ష్మీరెడ్డితో నాపై ఆరోపణలు చేయించాడు. అభినయరెడ్డికి దమ్ముంటే రేపు కాణిపాకంకు వచ్చి లక్ష్మీరెడ్డితో నాకెలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయగలడా..? అని ప్రశ్నించారు.నేను రేపు సాయంత్రం కాణిపాకంకు వస్తాను.. లక్ష్మిరెడ్డి ఎపిసోడ్ లో అభినయరెడ్డే కీలక పాత్ర అని ప్రమాణం చేస్తాను. వాళ్లు చేస్తారా అని ప్రశ్నించారు. మార్ఫింగ్ ఫోటోలతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక టీవీ, ఒక ఛానల్ నాపై బురదజల్లడానికి ప్రయత్నిస్తోందన్న కిరణ్ లక్ష్మీరెడ్డితో పాటు ఆమెకు సపోర్ట్ చేసే ఛానల్ పై పరువునష్టం దావా వేస్తానన్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి ఎలా తిరుపతి వచ్చాడు.. జిరాక్స్ షాపులు పెట్టుకున్న వ్యక్తికి వందల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది..? అని నిలదీశారు.. తిరుపతి ప్రజలు భూమన కుటుంబాన్ని ఎప్పుడూ నమ్మరు అని వ్యాఖ్యానించారు కిరణ్ రాయల్.. నా ఫొటోలను మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేసుకుంటున్నారు.. నా ఫొటోలు వాడినా వారిపై పరువు నష్టం దావా వేస్తున్నానని హెచ్చరించారు.. హానీ ట్రాప్ కాదు.. మనీ ట్రాప్.. లక్ష్మీతో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేయించారు.. లక్ష్మీ రెడ్డి అనే మహిళ నాకు తెలియదని కాణిపాకం వచ్చి అభినయ్ రెడ్డి ప్రమాణం చేస్తాడా..? అని సవాల్ విసిరారు.. మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం వీరికే చెల్లిందని ఫైర్ అయ్యారు.. నా మీద చేసినా కుట్రపై కోర్టు కేసులు వేస్తానని హెచ్చరించారు జనసేన నేత కిరణ్ రాయల్.
కాగా తిరుపతిలో చెక్ బౌన్స్ కేసులో అరెస్టైన లక్ష్మికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి గాను రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Jagan Vs Sharmila: చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం.. ఆ నేతలంతా వైసీపీలోకి..!