/rtv/media/media_files/2025/03/14/YjiFJQIPUzw6hR0I3NaG.jpg)
Holi celebrations
Holi celebrations : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అంతా కలిసి హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రంగుల హేలీ హోలీ. కొన్ని చోట్ల డీజే పాటలు పెట్టుకుని రంగులు చల్లుకుంటూ ఆడిపాడుతారు. అయితే హోలీ పండును కొన్ని చోట్ల ఒక్కో రకంగా జరుపుకుంటున్నారు. పలు చోట్ల వింత ఆచారాలు కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆచారాలను పాటిస్తూ ఆయా గ్రామాల్లో హోలీ సంబరాలను జరుపుకుంటారు ప్రజలు. ఇదే విధంగా కర్నూలు జిల్లాలోనూ ఓ వింత ఆచారం ఉంది. ఆ గ్రామంలో రెండు రోజుల పాటు ఈ ఆచారాన్ని పాటిస్తూ హోలీని జరుపుకుంటారు.
Also read : యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనీ మండలంలోని ఓ గ్రామంలో యువకులు వింత ఆచారం పాటిస్తారు. చీరలు కట్టుకొని ఆభరణాలు, పువ్వులతో సింగారించుకుని.. ఆడవారి వేషధారణలోకి మారిపోతారు. ఈ వింత ఆచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఆదోని మండలం సంతేకుడ్లూరులో ఎన్నో ఏళ్ల నుంచి వింత ఆచారం కొనసాగుతుంది. సంతేకుడ్లూరు గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకుని స్త్రీ వేషధారణలో రతీ మన్మథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. హోలీ నాడు స్త్రీల వేషంలో మన్మథస్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని...కోరికలు నెరవేరతాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. ఈ ఆచారం 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు తెలంగాణ, కర్ణాటక ప్రజలు కూడా అక్కడికి చేరుకుని ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సందడి చేస్తారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
/rtv/media/media_files/2025/03/14/vjtnuHLW9w2493qKzAd2.jpg)
ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు, కాటకాలు రావని అక్కడి స్థానికుల నమ్మకం. కరువు, కాటకాలు రాకుండా ఉండాలంటే ఆ గ్రామంలో పురుషులంతా చీర కట్టడం తప్పదు మరి.ఇలా చేయడం వల్ల కోరిక కోరికలు తీరుతాయని అక్కడి వారు బలంగా నమ్ముతారు. మరోవైపు ఇక్కడి వింత ఆచారాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తుంటారు. అంతే కాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా మగవాళ్లంతా ఆడవారి వేషధారణలోకి మారిపోయి రతీమన్మధుడికి పూజిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందనే వారి విశ్వాసం. ఇలా ప్రతీ ఏడాది కూడా రెండు రోజుల పాటు మగవారంత కూడా మహిళల వేషధారణలో పూజలు చేస్తుండటమే అక్కడి ప్రత్యేకత.
Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో...