YCP Blasting News : వైసీపీ విడుదల చేసిన 7PM బ్లాస్టింగ్ న్యూస్

గ‌న్నవ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొద‌ట టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీకి ముంద‌స్తు బెయిల్ ల‌భించింది.

New Update
YCP Blasting News

YCP Blasting News

YCP Blasting News: గ‌న్నవ‌రం టీడీపీ కార్యాల‌యం(Gannavaram TDP Office)పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ(Vallabhaneni Vamsi)ని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొద‌ట టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీకి ముంద‌స్తు బెయిల్ ల‌భించింది. కానీ ఎవ‌రైతే కార్యాల‌యంపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారో, ఆ ద‌ళిత యువ‌కుడే త‌న‌కు సంబంధం లేద‌ని కోర్టుకు అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు.  

Also Read: Hydra: అక్కడ ప్లాట్లు కొంటే పాట్లు తప్పవు...హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

దీంతో గ‌న్నవ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ త‌ర్వాత కేసు మ‌రో మ‌లుపు తిగింది. త‌మ సోద‌రుడిని కిడ్నాప్ చేసి, బెదిరించి త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేసేలా ఉసిగొల్పార‌ని ఫిర్యాదుదారుని సోద‌రుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ ఫిర్యాదు మేర‌కు వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు(SC, ST Case) న‌మోదు చేశారు.

Also Read: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్‌ టెస్టులు ఫ్రీ

వంశీ అరెస్ట్‌ లక్ష్యంగా చంద్రబాబు సర్కార్‌ కుట్రలు

హైద‌రాబాద్ నివాసంలో ఉంటున్న వంశీని విజ‌య‌వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలో గ‌న్నవ‌రం ఘ‌ట‌న‌పై సాయంత్రం ఏడు గంటలకు వైసీపీ బ్లాస్టింగ్‌ న్యూస్‌ బయటపెడుతామంటూ పోస్ట్‌ చేసింది. అయితే అన్నట్లుగానే వైసీపీ ఒక న్యూస్‌ బయటపెట్టింది. వంశీ అరెస్ట్‌ లక్ష్యంగా చంద్రబాబు సర్కార్‌ కుట్రలు పన్నుతుందని వైసీపీ ఆరోపించింది. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్ట్‌లకు పాల్పడతుందని ఆరోపించింది. కోర్టు ముందు సత్యవర్ధన్‌ ఇచ్చిన స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం అంటూ సత్యవర్థన్‌ స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేసింది.

Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్‌ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్

చంద్రబాబు స‌ర్కార్ కుట్రను బయటపెట్టిన స‌త్యవ‌ర్దన్ అంటూ ఒక వార్తను విడుదల చేసింది. ఈనెల10 నాటి స్టేట్‌మెంట్‌గా పేర్కొన్న ఈ స్టేట్‌మెంట్‌లో ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ సత్యవర్థన్‌ న్యాయమూర్తికి తెలిపినట్లు ఆ లేఖలో ఉంది. టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నాడని వెల్లడించిన సత్యవర్ధన్‌. తనను ఎవరూ బలవంతం పెట్టలేఊదని కూడా కోర్టులో వెల్లడించినట్లు వైసీపీ తెలిపింది. కాగా దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: అశ్లీల కంటెంట్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు