Breaking: ఏపీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఈ 12న ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. By Bhavana 13 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి APPSC: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలక్షన్ హడావిడి నడుస్తున్నప్పటికీ ఎన్నికలతో సంబంధం లేకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన కొద్ది రోజులకే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు కూడా విడుదల చేసింది. కేవలం 27 రోజుల్లోనే గ్రూప్ 1 ఫలితాలు విడుదల అయ్యాయి. మార్చి 27 న గ్రూప్ 1 పరీక్షను నిర్వహించగా..ఏప్రిల్ 12 న ఫలితాలు విడుదల అయ్యాయి. గతంలో కూడా ఇదే స్పీడ్ తో రిజల్ట్స్ విడుదల అయ్యాయి. అయితే ఎన్నికల హడావిడి ఉన్నా కూడా రిజల్ట్స్ త్వరగా వచ్చాయి. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్లలో 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఏపీలో వరుసగా గ్రూప్-1, గ్రూప్-2, డిప్యూటీ ఈవో, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు జరిగి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఏడాది సెప్టెంబర్-2 నుంచి 9వతేదీ మధ్యలో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని APPSC ప్రకటించింది. ఎన్నికల తర్వాత ఈ రెండిటికి సంబంధించి మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. డిప్యూటీ ఈవో పరీక్ష వాయిదా పడిన నేపథ్యంలో ఎన్నికల తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. కోర్టు కేసులతో టెట్, డీఎస్సీ కూడా వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియామకాల భర్తీ ఉంటుంది. Also read: బీచ్ లో సరదాగా గడుపుతున్న దీపికా.. ఫొటోలు వైరల్! #ap #results #appsc #released మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి