AP : దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి..

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో పోలీసులే దొంగలుగా మారారు. ఓ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం రూ.25 లక్షలు రీకవరీ చేసి.. అందులో రూ. 6 లక్షలు కొట్టేశారు. విషయం బయటకు రావడంతో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు.

New Update
AP : దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి..

NTR District : ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ (Nandigama) లో దొంగతనాలను అరికాట్టాల్సిన పోలీసులే దొంగలు (Thieves) గా మారిన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా దొంగ నుంచే సొమ్ము నొక్కేశారు. వివరాల్లోకి వెళితే..  ఖమ్మం జిల్లా రైతులు ఈ నెల 17న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌కు ఓ లారీలో మిర్చి లోడ్‌ చేసి.. మైలవరానికి చెందిన డ్రైవర్‌ షేక్‌ ఖయీంకి ఇచ్చి పంపారు. క్లీనర్‌గా నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన పల్లెపోగు కోటేశ్వరరావు అనే వ్యక్తి వెళ్లాడు.

మిర్చి సరకు విక్రయించగా వచ్చిన రూ. 25 లక్షలు తీసుకుని వారు తిరిగి బయలు దేరారు. ఈ నెల 21న పాల్వంచ జంక్షన్‌ వద్ద క్లీనర్‌ కోటేశ్వరరావు లారీ దిగి వెళ్లిపోయాడు. నందిగామ మండలం జొన్నలగడ్డ వద్దకు వచ్చాక డ్రైవర్‌ ఖయీంకు అనుమానం వచ్చి చూసుకోగా లారీలో ఉంచిన డబ్బు కనిపించలేదు. దీనిపై డ్రైవర్‌ నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద క్లీనర్‌ కోటేశ్వరరావును పట్టుకున్నారు.

Also Read: ఫార్మా బాధితులను పరామర్శించిన జగన్.. మా హయాంలోనే ఎక్కువ ప్రమాదాలు అంటూ..

అయితే, పోలీసులు అతడి వద్ద రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకొని, అందులో రూ. 6 లక్షలు కొట్టేసి.. మిగిలిన రూ. 18.52 లక్షలు మాత్రమే దొరికినట్లు వారిపై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ACP రవికిరణ్‌ నందిగామలో మాట్లాడుతూ.. చోరీ సొత్తు రూ. 18.52 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కానీ, లారీ డ్రైవర్ ఖయీం, రైతులు మాత్రం రూ. 25 లక్షలు చోరీకి గురైనట్లు వాపోయారు.

దీంతో క్లీనర్‌ కోటేశ్వరరావును విచారించగా, అసలు విషయం బయటపడింది. పోలీసులే రూ. 6 లక్షలు తీసుకున్నారని చెప్పాడు. వారిని విచారించగా, రూ.3.95 లక్షలు అప్పగించినట్లు సమాచారం. మిగిలిన మొత్తం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసులో దొంగ నుండే సొమ్ము కొట్టిసేని ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చి వారిని సస్పెండ్‌ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు